Unstoppable With NBK : బాలకృష్ణ షోలో చంద్రబాబు గురించి ప్రశ్నించిన మోహన్ బాబు

మోహన్ బాబు బాలకృష్ణని ఎన్టీఆర్‌ తర్వాత మీరెందుకు టీడీపీ పగ్గాలు చేపట్టలేదు, చంద్రబాబుకి ఎందుకు ఇచ్చేశారు అని అడిగారు. ముందు సీరియస్ అయినట్టు కనిపించినా బాలకృష్ణ ఈ ప్రశ్నని

Unstoppable With NBK : బాలకృష్ణ షోలో చంద్రబాబు గురించి ప్రశ్నించిన మోహన్ బాబు

Chandrababu

Unstoppable With NBK :  బాలకృష్ణ తొలిసారి యాంకర్ గా చేస్తున్న షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ఈ షో ప్రసారమవుతోంది. దీపావళి సందర్భంగా ఇవాళ ఉదయం నుంచి ఈ షో ప్రారంభమైంది. బాలకృష్ణ చేసిన తొలి ఇంటర్వ్యూ ఇవాళ ఉదయం టెలికాస్ట్ అయింది. మొదటి ఇంటర్వ్యూలో డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో సందడి చేశారు బాలయ్య. బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు మోహన్‌బాబు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. మధ్యలో మోహన్ బాబు కూడా బాలకృష్ణకు ప్రశ్నలు వేశారు.

Mohan Babu : చిరంజీవి మన ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టే బాగున్నాడు: మోహన్ బాబు

ఈ ఇంటర్వ్యూలో భాగంగా మోహన్ బాబు బాలకృష్ణని ఎన్టీఆర్‌ తర్వాత మీరెందుకు టీడీపీ పగ్గాలు చేపట్టలేదు, చంద్రబాబుకి ఎందుకు ఇచ్చేశారు అని అడిగారు. ముందు సీరియస్ అయినట్టు కనిపించినా బాలకృష్ణ ఈ ప్రశ్నని తేలిగ్గా తీసుకొని సమాధానం ఇచ్చారు. ఈ ప్రశ్నకి బాలయ్య సమాధానం చెప్తూ.. అప్పట్లో ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ అంటూ ఇలా వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా టీడీపీ పోరాటం చేసింది. నాన్న గారు కూడా వారసత్వ రాజకీయాలకి వ్యతిరేకం. ఆ సమయంలో వంశపారంపర్య రాజకీయాలు మనమే చేస్తే బాగుండదు. పార్టీ అనేది ప్రజల కోసం నిలబడాలి. అందుకే నేను టీడీపీ పగ్గాలు తీసుకోలేదు అని అన్నారు. ఇక చంద్రబాబు గురించి చెప్తూ చంద్రబాబు కూడా పంచాయతీ స్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తి, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని బాలకృష్ణ అన్నారు.

Puneeth Rajkumar : కంఠీరవ స్టేడియంకు బారులు తీరిన అభిమానులు

తర్వాత బాలయ్య మీరు అంతగా ప్రేమించే ఎన్టీఆర్ పార్టీని కాదనుకొని వేరే పార్టీకి ఎందుకు వెళ్లారు అని మోహన్ బాబుని ప్రశ్నించారు. మోహన్ బాబు దీనికి సమాధానం చెప్తూ.. నేను చంద్రబాబు మాట విని అన్నయ్యను కాదనుకుని వచ్చాను. ఆ తర్వాత స్నేహితుడు రజనీకాంత్‌తో వెళ్లి అన్న గారిని కలిసినప్పుడు ‘మోహన్‌బాబూ.. నువ్వు కూడానా’ అని అన్నయ్య ఎన్టీఆర్‌ అనేసరికి నోట మాట రాలేదు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ తర్వాత అన్నగారు వెళ్ళిపోయాక కొన్ని రోజులకు క్రమశిక్షణ లేదని చంద్రబాబు నన్ను బయటకు పంపారు. మళ్ళీ అక్కడికి రావాల్సిన అవసరం ఇంక రాలేదు అని తెలిపారు. ప్రస్తుతం మోహన్ బాబు వైసీపీకి మద్దతు ఇస్తున్నారన్న సంగతి మనకు తెలిసిందే.