Mrunal Thakur: మృణాల్‌కు ఎప్పుడూ సంతోషాన్ని ఇస్తోన్న సీతారామం!’

టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా భారీ విజయాన్ని అందుకున్న మూవీ ‘సీతా రామం’. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల ఠాకూర్‌లు తమ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ సినిమా తనకు ఎప్పటికీ సంతోషాన్ని కలిగిస్తోందని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అంటోంది.

Mrunal Thakur: మృణాల్‌కు ఎప్పుడూ సంతోషాన్ని ఇస్తోన్న సీతారామం!’

Mrunal Thakur Feeling Happy Always With Sita Ramam

Mrunal Thakur: టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా భారీ విజయాన్ని అందుకున్న మూవీ ‘సీతా రామం’. దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల ఠాకూర్‌లు తమ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.

Mrunal Thakur: సీతా రామం దెబ్బ అమ్మడికి గట్టిగానే తగిలినట్టు ఉందిగా!

కాగా, ఈ సినిమా తనకు ఎప్పటికీ సంతోషాన్ని కలిగిస్తోందని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అంటోంది. తాను ఎప్పుడు ట్విట్టర్ ఓపెన్ చేసినా, సీతా రామం మూవీ ట్రెండింగ్‌లో కనిపిస్తుండటం.. తన సంతోషాన్ని రెట్టింపు చేస్తోందని ఆమె ఈ సందర్భంగా తెలిపింది. ఈ సినిమాలో తనకు సీత పాత్రను ఇచ్చిన దర్శకుడు హను రాఘవపూడికి ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.

Mrunal Thakur In For NTR 30: తారక రాముడి కోసం కదలివస్తున్న సీతా..?

ఇక ఈ సినిమాలో రామ్ పాత్రలో దుల్కర్, సీత పాత్రలో మృణాల్ చేసిన పర్ఫార్మెన్స్ క్రిటిక్స్ ప్రశంసలు కూడా అందుకుంది. అటు ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన రష్మిక మందన ఈ సినిమాకు మరో మేజర్ బలంగా మారిందని చెప్పాలి. ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో అందుబాటులోకి రాగా, ప్రేక్షకులు ఇంకా ఈ సినిమాను ట్రెండింగ్‌లో పెట్టడం చిత్ర యూనిట్‌కు సంతోషాన్ని కలిగిస్తోంది.