Mrunal Thakur: సీతా రామం ఎఫెక్ట్.. భారీగా పెంచేసిన బాలీవుడ్ బ్యూటీ!

దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘సీతా రామం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌లు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ‘సీతా రామం’ గ్రాండ్ సక్సెస్ కారణంగా, అందాల భామ మృణాల్‌కు ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయని.. దీంతో అమ్మడు తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసిందని తెలుస్తోంది.

Mrunal Thakur: సీతా రామం ఎఫెక్ట్.. భారీగా పెంచేసిన బాలీవుడ్ బ్యూటీ!

Mrunal Thakur Hikes Remuneration After Sita Ramam

Mrunal Thakur: దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘సీతా రామం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌లు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది.

Mrunal Thakur: మృణాల్‌కు ఎప్పుడూ సంతోషాన్ని ఇస్తోన్న సీతారామం!’

ఈ సినిమాలో దుల్కర్, మృణాల్‌ల కెమిస్ట్రీ అద్భుతంగా ఉండటం, ఈ సినిమాకు మేజర్ బలంగా మారింది. అయితే ఈ సినిమాతో దుల్కర్ కంటే కూడా ఎక్కువ పేరును తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. అప్పటివరకు కేవలం బాలీవుడ్‌కే పరిమితం అయిన ఈ బ్యూటీ, సీతా రామం సక్సెస్ తరువాత అన్ని ఇండస్ట్రీల చూపులు ఆమెపై పడ్డాయి. ఇప్పటికే తెలుగులో మృణాల్ కోసం భారీ ఆఫర్లు వస్తున్నాయని.. అయితే తన నెక్ట్స్ చిత్రం విషయంలో మృణాల్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Mrunal Thakur: సీతా రామం దెబ్బ అమ్మడికి గట్టిగానే తగిలినట్టు ఉందిగా!

కాగా, ఈ వార్తతో పాటు మరో విషయం కూడా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ‘సీతా రామం’ గ్రాండ్ సక్సెస్ కారణంగా, అందాల భామ మృణాల్‌కు ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయని.. దీంతో అమ్మడు తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసిందని తెలుస్తోంది. ఏదేమైనా సీతా రామం ఎఫెక్ట్ కారణంగానే అమ్మడు తన రెమ్యునరేషన్ పెంచేసిందని.. అందులో ఎలాంటి తప్పులేదని ఆమె అభిమానులు అంటున్నారు. మరి మృణాల తన నెక్ట్స్ మూవీ కోసం ఎంతమేర రెమ్యునరేషన్ పుచ్చుకుంటుందో చూడాలి.