Music Director Koti : విలన్ గా మారిన మ్యూజిక్ డైరెక్టర్.. సెకండ్ ఇన్నింగ్స్ షురూ..?

ఇటీవల వచ్చిన సెహ‌రి సినిమాతో సిల్వ‌ర్ స్క్క్రీన్‌పై కూడా న‌టుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో హీరో తండ్రిగా న‌టించారు కోటి. దీంతో కోటి ఆర్టిస్ట్ గా కూడా మారబోతున్నారు అని హింట్ ఇచ్చేశారు. ఇప్పుడు మరో కొత్త సినిమాలో కోటి విలన్ గా నటించబోతున్నట్టు........

Music Director Koti : విలన్ గా మారిన మ్యూజిక్ డైరెక్టర్.. సెకండ్ ఇన్నింగ్స్ షురూ..?

Music Director koti

Music Director Koti :  ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక పక్క సినిమాలకి సంగీతం అందిస్తూనే పలు మ్యూజిక్ షోలకి జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలా టీవీ షోలలో జడ్జిగా కనిపిస్తూ అక్కడ సరదాగా ఉంటూ ఇప్పటికే బుల్లితెరపై అదరగొట్టేస్తున్నారు కోటి.

ఇటీవల వచ్చిన సెహ‌రి సినిమాతో సిల్వ‌ర్ స్క్క్రీన్‌పై కూడా న‌టుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో హీరో తండ్రిగా న‌టించారు కోటి. దీంతో కోటి ఆర్టిస్ట్ గా కూడా మారబోతున్నారు అని హింట్ ఇచ్చేశారు. ఇప్పుడు మరో కొత్త సినిమాలో కోటి విలన్ గా నటించబోతున్నట్టు ప్రకటించారు. కొత్త వాళ్ళతో తెరకెక్కుతున్న ‘ప‌గ ప‌గ ప‌గ’ అనే సినిమాలో కోటి విలన్ గా నటించనున్నారు.

Ranveer Singh : ర‌ణ్‌వీర్‌సింగ్ న్యూడ్ ఫోటోషూట్.. విచారణకి రావాలని సమన్లు జారీ చేసిన ముంబై పోలీసులు..

తాజాగా కోటికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇందులో కోటి స్టైలిష్‌గా మాసీ లుక్‌లో నోట్లో సిగార్ పెట్టుకొని అదరగొట్టేశారు. ఈ సినిమాలో విలన్ గా నటించడమే కాకుండా మ్యూజిక్ కూడా కోటినే అందిస్తున్నారు. ఇలా ఆర్టిస్ట్ గా కోటి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కోటికి ఆర్టిస్ట్ గా మరిన్ని సినీ అవకాశాలు వస్తున్నాయి. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో కోటి ఏ రేంజ్ లో మెప్పిస్తారో చూడాలి.