ఎంత మంచివాడవురా ప్రీ రిలీజ్ : నా కోరిక తీరింది – జూ.ఎన్టీఆర్

  • Published By: madhu ,Published On : January 8, 2020 / 04:06 PM IST
ఎంత మంచివాడవురా ప్రీ రిలీజ్ : నా కోరిక తీరింది – జూ.ఎన్టీఆర్

ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసిన అన్న కళ్యాణ్..మంచి కుటుంబసమేత చిత్రం చేయాలని తనకు కోరిక ఉండేదన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ కోరిక వేగ్నేశ ద్వారా నిజమౌతుందన్నందుకు ఆనందంగా ఉందన్నారు. కృష్ణ ప్రసాద్ తమ కుటుంబంలో ఒక సభ్యుడని వివరించారు. మంచి చిత్రాన్ని ఆదరించే గుణం తెలుగు ప్రేక్షకుల్లో ఉందన్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అవుతున్న దర్బార్, సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురం, ఎంతమంచి వాడవురా..సినిమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తెలుగు చిత్ర సీమ ముందుకు వెళ్లేలా దోహదపడాలని కోరుకుంటున్నట్లు జూ. ఎన్టీఆర్ వెల్లడించారు. 

హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్ సెంటర్‌లో ఎంత మంచివాడవురా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. పక్కా ఫ్యామిలీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2020, జనవరి 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే టీజర్, పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. చిత్రానికి జాతీయ స్థాయి అవార్డు దక్కించుకున్న సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో రూపొందింది.

కళ్యాణ్ సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటించింది. శరత్ బాబు, సుహాసిని, నరేశ్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. కళ్యాణ్ రామ్ నటించిన అతనొక్కడే, ఫటాస్ సినిమాలు అంతగా ఆడలేదు. దీంతో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు కళ్యాణ్ రామ్. 

Read More : అన్న కోసం తమ్ముడు : ఎంత మంచివాడవురా ప్రీ రిలీజ్ ఈవెంట్