Naga Chaitanya : అప్పుడు తాత.. ఇప్పుడు మనవడు.. చైతన్య మరో మూగ మనసులు ప్లాన్ చేస్తున్నాడా?

అక్కినేని నాగేశ్వరరావు క్లాసిక్ మూవీ 'మూగ మనసులు' చిత్రానికి, ఇప్పుడు నాగచైతన్య కొత్త సినిమాకి సంబంధం ఏంటో తెలుసా?

Naga Chaitanya : అప్పుడు తాత.. ఇప్పుడు మనవడు.. చైతన్య మరో మూగ మనసులు ప్లాన్ చేస్తున్నాడా?

Naga Chaitanya new movie story line is near to Nageswara Rao Mooga Manasulu

Akkineni Nageswara Rao : అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ లో ఒక క్లాసిక్ గా నిలిచిన సినిమా మూగ మనసులు. సావిత్రి, జమున ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా లవ్ స్టోరీస్ లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆ సినిమాలో నాగేశ్వరరావు గోదారిలో పడవ నడుపుకునే వ్యక్తిగా కనిపించాడు. సావిత్రి, జమున జమీందార్ కూతుళ్లుగా కనిపించారు. ఇక ఇప్పుడు నాగచైతన్య అలాంటి ఒక కథతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడని తెలుస్తుంది. చైతన్య తనకి ‘ప్రేమమ్’ వంటి సూపర్ హిట్టుని అందించిన చందు ముండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.

Sharwanand : శర్వానంద్ పెళ్లి శుభలేఖ చూశారా.. పెళ్ళికొడుకుని చేసే టైం, పెళ్లి టైం ఎప్పుడంటే!

ఇక ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేయబోతున్నారు. ఇటీవల ఒక మూవీ ఫంక్షన్ లో పాల్గొన్న నిర్మాత బన్నీ వాసు ఈ మూవీ స్టోరీ లైన్ ని రివీల్ చేశాడు. గుజరాత్ లో జరిగిన ఒక రియల్ స్టోరీతో ఈ సినిమా కథ ఉండబోతుందట. ఒక స్వచ్ఛమైన ప్రేమ కథతో ఈ మూవీ ఉండనుందట. అలాగే ఎన్నో ట్విస్ట్ లు కూడా ఉంటాయని తెలియజేశాడు. ఇక ఈ సినిమాలో చైతన్య బోట్ డ్రైవర్ గా కనిపించబోతున్నాడని పేర్కొన్నాడు. ఈ మూవీ కోసం జాలర్ల లైఫ్ స్టైల్ పై మూవీ టీం బాగా రీసెర్చ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు బన్నీ వాసు.

Ram Charan : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై రామ్ చరణ్ ట్వీట్.. బంగారు తెలంగాణ కల!

ఆల్రెడీ ‘మహానటి’ సినిమాలో నాగచైతన్య మూగ మనుసులు మూవీలోని నాగేశ్వరరావు క్యారెక్టర్ లో కొంతసేపు కనిపించి అలరించాడు. ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో అలాంటి పాత్రలో కనిపించబోతున్నాడని తెలియడంతో.. అక్కినేని అభిమానులు ఈ సినిమా మరో మూగ మనసులు కాబోతుందా? అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మూవీతో చైతన్య అక్కినేని అభిమానులను ఎంతలా అలరిస్తాడో చూడాలి.