Naga Chaitanya: అలా చేస్తే అభిమానులు చంపేస్తారట.. డైరెక్టర్‌కు చైతూ వార్నింగ్!
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’కి ముందుగా వేరొక టైటిల్ పెట్టాలని దర్శకుడు భావించాడట. అయితే, ఆ టైటిల్ పెడితే ఫ్యాన్స్ ఊరుకోరని చైతూ వార్నింగ్ ఇచ్చాడట.

Naga Chaitanya Warns Venkat Prabhu Of Fans
Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాను పూర్తి కాప్ యాక్షన్ డ్రామాగా చిత్ర యూనిట్ రూపొందించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్స్‌కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.
Naga Chaitanya : ఏమున్నాడ్రా బాబు.. కస్టడీ ప్రమోషన్స్ లో చైతూ..
దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు ఆశిస్తున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి హీరో నాగ చైతన్య పలు ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేశాడు. కస్టడీ మూవీకి ముందుగా వేరొక టైటిల్ పెట్టాలని దర్శకుడు వెంకట్ ప్రభు భావించాడట. ఈ సినిమాకు శివ అనే టైటిల్ పెడితే బాగుంటుందని వెంకట్ ప్రభు సూచించాడట. అయితే, ఈ సినిమాకు శివ అనే టైటిల్ పెడితే అభిమానులు ఊరుకోరని.. శివ లాంటి కల్ట్ క్లాసిక్ మూవీ టైటిల్‌ను వాడే ముందు జాగ్రత్తగా ఉండాలని.. లేకపోతే అబిమానులు చంపేస్తారని దర్శకుడికి చైతూ చెప్పాడట.
Naga Chaitanya : యాక్టర్స్ కెరీర్ లో ఇవి సహజం.. ఏజెంట్ ఫ్లాప్ గురించి మాట్లాడిన నాగచైతన్య..
ఇక ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని.. ఈ సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోండగా, ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మే 12న కస్టడీ మూవీని ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.