Big Boss 5: దేవకన్యలా ఉన్నావన్న నాగ్.. కొత్తగా చెప్పమని పంచ్‌ ఇచ్చిన బ్యూటీ!

తెలుగులో బిగ్ బాస్ షోను రిబ్బన్ కట్ చేసిన హోస్ట్ ఎన్టీఆర్ అయినా సీనియర్ హీరో నాగార్జునకి ఈ షోతో మంచి సంబంధం ఏర్పడింది. ఐదు సీజన్లలో మూడు సీజన్లు నాగార్జునే ఇంటిని నడిపించాడు.

Big Boss 5: దేవకన్యలా ఉన్నావన్న నాగ్.. కొత్తగా చెప్పమని పంచ్‌ ఇచ్చిన బ్యూటీ!

Big Boss 5 (1)

Big Boss 5: తెలుగులో బిగ్ బాస్ షోను రిబ్బన్ కట్ చేసిన హోస్ట్ ఎన్టీఆర్ అయినా సీనియర్ హీరో నాగార్జునకి ఈ షోతో మంచి సంబంధం ఏర్పడింది. ఐదు సీజన్లలో మూడు సీజన్లు నాగార్జునే ఇంటిని నడిపించాడు. ఇప్పటి వరకు వచ్చిన కంటెస్టెంట్లు కూడా నాగార్జున కంటే చాలా జూనియర్లు కావడంతో చాలా గౌరవంతో కూడా మర్యాదగా ప్రవర్తించేవారు. అయితే.. నాగ్ మాత్రం తన మన్మధుడు బ్రాండ్ తగ్గట్లే కాస్త చిలిపిగా మరికాస్త కలుపుగోలుగా కంటెస్టెంట్లను ఎంకరేజ్ చేస్తుంటాడు. అందుకే చిన్న చిన్న సోషల్ మీడియా సెలబ్రిటీలు సైతం నాగార్జునకు దగ్గరవుతూ వచ్చారు.

Big Boss 5: లహరి ఎలిమినేషన్.. కారణాలివేనా?

కాగా, ఐదు ఎపిసోడ్లలో ఓ కంటెస్టెంట్ నుండి నాగార్జునకు తొలిసారి పంచ్ పడింది. సహజంగా వీకెండ్ అంటే నాగ్ వస్తాడని హౌస్ మేట్స్ అందరూ అందంగా ముస్తాబై కెమెరా ముందుకొస్తారు. ఈ ఆదివారం కూడా అందరూ అలానే చక్కగా వచ్చారు. సిరి, ప్రియాంకా, హమీదా ఒకరిని మించి ఒకరు గ్లామర్ గా సిద్ధమయ్యారు. అయితే, హమీదాను చూసి మైమరిచిపోయిన నాగ్‌ దేవతలా ఉన్నావంటూ మెచ్చుకున్నాడు. దీనికి హమీదా ఏదైనా కొత్తగా చెప్పు అని పంచ్‌ ఇచ్చింది. హమీదా మాటతో అందరూ ఒక్కసారిగా షాక్. అయితే నాగ్ మాత్రం అంతే రేంజ్ లో రివర్స్ పంచ్ ఇచ్చాడు.

Big Boss 5: లహరి ఎలిమినేషన్.. కారణాలివేనా?

దీంతో నాగ్ చాలా హాట్‌గా ఉన్నావనడంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకుంటే హమీదా గాల్లో తేలిపోయింది. ఇక ఇదే ఎపిసోడ్ లో బాయ్స్, గర్ల్స్ అంటూ సపరేట్ గా చూడడం అంటే అసలు ఇష్టం ఉందని నాగ్ అంటే.. మాకు కూడా అసలు ఇష్టం ఉందని సిరి కొంటెగా సమాధానం చెప్పింది. దీనికి నాగ్ ఆ విషయం నాకు తెలుసని అంతే కొంటెగా రిటర్న్ ఇచ్చాడు. లహరి బయటకి వెళ్లిందనే బాధ మినహా సండే ఎపిసోడ్ మొత్తం కాస్త చిలిపిగా మరికాస్త కొంటెగా సాగుతూ వచ్చింది.