Nagarjuna: మరో అక్కినేని మల్టీస్టారర్?.. ఈసారి చిన్న కొడుకుతో నాగ్!

సీనియర్ హీరోలలో బాలకృష్ణ, చిరంజీవి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారా అనేలా వరస సినిమాలతో అదరగొడుతుంటే.. మరో ఇద్దరు సీనియర్ హీరోలు వెంకటేష్..

Nagarjuna: మరో అక్కినేని మల్టీస్టారర్?.. ఈసారి చిన్న కొడుకుతో నాగ్!

Nagarjuna

Nagarjuna: సీనియర్ హీరోలలో బాలకృష్ణ, చిరంజీవి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారా అనేలా వరస సినిమాలతో అదరగొడుతుంటే.. మరో ఇద్దరు సీనియర్ హీరోలు వెంకటేష్, నాగార్జున యంగ్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలతో వచ్చేందుకు ఇష్టపడుతున్నారు. నాగార్జున అయితే.. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు మల్టీస్టారర్ సినిమాలను ప్లాన్ చేసుకుంటూ కెరీర్ ను మరికొన్నేళ్ల పాటు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది.

Nagarjuna : 1080 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్న నాగార్జున

ఈ మధ్యనే పెద్ద కుమారుడు నాగ చైతన్యతో కలిసి బంగార్రాజుగా అలరించి మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలలో వేసుకున్న నాగార్జున.. ఇప్పుడు చిన్న కుమారుడు అఖిల్ తో కలిసి మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం నాగార్జున చేసే సినిమాలతో కలిపి 99 సినిమాలు పూర్తవుతాయి. దీంతో వందో సినిమా తనకు స్పెషల్ గా ఉండాలనుకుంటున్న నాగ్ అఖిల్ తో కలిసి మల్టీస్టారర్ కు ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను చిరంజీవితో గాడ్ ఫాదర్ తెరకెక్కిస్తున్న సీనియర్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడట.

Nagarjuna- Jr NTR: సీఎం జగన్‌తో భేటికి నాగార్జున, ఎన్టీఆర్ గైర్హాజరు.. కారణం ఏంటంటే?

ఇది ఇప్పటికే జనరేషన్ టెక్నాలజీతో కూడుకున్న కథాంశంతో తెరకెక్కే సినిమాగా తెలుస్తుండగా.. అఖిల్-నాగ్ ఇద్దరికీ సమానస్థాయిలో కథ సిద్దమైందట. ఒకరకంగా ఇది ఒక ప్రయోగమే కాగా కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేసిన నాగార్జున మరోసారి ఈ ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున ఘోస్ట్ సినిమాతో బిజీగా ఉండగా.. అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక మల్టీస్టారర్ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుందట.