Nagarjuna : అఖిల్ కడుపులో ఉన్నప్పుడు అమలను ఇబ్బంది పెట్టాడు.. బయటకు వచ్చాక మమ్మల్ని.. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే..

తాజాగా ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం వరంగల్ లో భారీగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేశారు.

Nagarjuna : అఖిల్ కడుపులో ఉన్నప్పుడు అమలను ఇబ్బంది పెట్టాడు.. బయటకు వచ్చాక మమ్మల్ని.. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే..

Nagarjuna speech in Agent Pre Release Event

Nagarjuna :  అక్కినేని అఖిల్(Akkineni Akhil), సాక్షి వైద్య(Sakshi Vaidya) జంటగా సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏజెంట్(Agent). మొదటి సారి అఖిల్ పూర్తిగా మాస్, యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. ఏజెంట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి(Mammootty) ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు పెంచారు. ఏజెంట్ సినిమాను ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ తో ఫుల్ జోష్ లో ఉంది చిత్రయూనిట్.

తాజాగా ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం వరంగల్ లో భారీగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ… వరంగల్ పోరాటాలకు అడ్డా. వీరత్వానికి ఇంటి పేరు. వైల్డ్ వరంగల్. మా అందరికీ మీరంటే పిచ్చి. సినిమాలంటే ప్రేమ. తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా గొప్పవాళ్ళు. ఒక కొత్త జోనర్ తో ఒక మంచి సినిమా ఇస్తే దాన్ని బ్లాక్ బస్టర్ చేసి తీరుతారు. ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి గారు అదే కొత్త జోనర్ తో ఒక చక్కటి థ్రిల్లింగ్, స్పై సినిమాను మీ ముందు పెడుతున్నారు. అందుకే ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను సినిమా చూడలేదు, కథ వినలేదు. కానీ అఖిల్ ఇంట్లో చెబుతుంటే వినేవాడిని. బ్లాక్ బస్టర్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. సురేందర్ రెడ్డి గారు ఎన్నో బ్లాక్ బస్టర్స్ తీశారు. అలాగే అనిల్ సుంకర గారు ఎక్కడా వెనకడుగు వేయకుండా ఎంతో ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు. మీరు స్టన్నింగ్ విజువల్స్ చూస్తారు. సాక్షి బ్యూటీఫుల్ హీరోయిన్. తనకి చాలా మంచి భవిష్యత్తు ఉండాలి. సూపర్ స్టార్ మమ్ముట్టి గారు కథ ఒప్పుకున్నారంటే అది మాములుగా వుండదు. ఆయన సినిమా ఒప్పుకున్నారని తెలిసి, ఖచ్చితంగా ఈ సినిమా అఖిల్ కి పెద్ద హిట్ అవుతుందని ఆనందపడ్డాను. ఇటివలే మమ్ముట్టి గారి మాతృమూర్తి ఫాతిమా గారు కన్నుమూశారు. ఫాతిమా గారి ఆత్మకి శాంతి చేకూరాలి. మమ్ముట్టి గారు ఎంత అంకితభావం కలిగిన నటుడు అంటే ఇంత కష్టకాలంలో కూడా డబ్బింగ్ ఫినిష్ చేసి విడుదలకు రెడీ చేశారు. వారికి కృతజ్ఞతలు అని అన్నారు.

Bhushan Kumar : ఆదిపురుష్ సినిమాపై వచ్చిన విమర్శలకు మొదటిసారి స్పందించిన నిర్మాత.. ఏమన్నాడో తెలుసా?

ఇక అఖిల్ గురించి మాట్లాడుతూ.. ఇక వైల్డ్ సాలా గురించి మాట్లాడాలి. వాడి ఎనర్జీ మీరు ఇప్పుడు చూస్తున్నారు. మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. కడుపులో ఉన్నప్పుడే ఉన్నపుడే వాళ్ళ అమ్మని చాలా ఇబ్బంది పెట్టాడు. తనకి ఏడాదిన్నర ఉన్నప్పుడు రెస్ట్ లెస్ గా పరిగెత్తేవాడు. అప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. అంత చిన్నపిల్లలకి అలాంటి ఎనర్జీ వుండటం మేము ఎప్పుడూ చూడలేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళితే వీడిలో ఎక్కువ ఎనర్జీ ఉంది, దాన్ని బయటికి లాగాలంటే నేలపై రోజుకో గంట సేపు పడుకోబెట్టండని చెప్పారు. సురేందర్ రెడ్డి గారు ఆ ఎనర్జీ అంతా తీసి సినిమాలో పెట్టారు. ఈ సినిమా కోసం అఖిల్ పడుతున్న కష్టం కళ్ళారా చూశాను. ప్రేక్షకులు, అభిమానులు మా వెనుక లేకపోతే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వదు. మిమ్మల్ని చూస్తుంటే తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనిపిస్తుంది అని తెలిపారు.