Nandamuri Mokshagna: శ్యామ్ సింగరాయ్ దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ వెండితెర తెరంగేట్రం.. నిజమేనా?

నందమూరి నట వారసుడిగా తెలుగు వెండితెరకి పరిచయమై "నందమూరి నటసింహం" అనిపించుకుంటున్న టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు అయన వారసుడిని టాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే అందరు అనుకున్నట్టు బాలకృష్ణ తన తనయుడిని ఒక మాస్ కథతో కాకుండా...

Nandamuri Mokshagna: శ్యామ్ సింగరాయ్ దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ వెండితెర తెరంగేట్రం.. నిజమేనా?

Nandamuri Mokshagna Tollywood Entry by Shyam Singha Roy Movie Director

Updated On : September 8, 2022 / 3:31 PM IST

Nandamuri Mokshagna: నందమూరి నట వారసుడిగా తెలుగు వెండితెరకి పరిచయమై “నందమూరి నటసింహం” అనిపించుకుంటున్న టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు అయన వారసుడిని టాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అయిన తోటి హీరోలు చిరంజీవి, నాగార్జున వారి వారసులను వెండితెరకు పరిచయం చేయగా, నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Nandamuri Balakrishna : హీరో బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు.. ఆ సినిమా విషయంలో వివాదం

ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తుండగా, మోక్షజ్ఞ తన బర్త్ డేను ఈ మంగళవారం తండ్రి బాలకృష్ణ సమక్షంలో NBK107 చిత్ర యూనిట్ తో కలిసి జరుపుకున్నారు. ఇక బాలయ్య తనయుడు ఎంట్రీపై ఎప్పటినుంచో ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. ఈసారి అవి నిజం కాబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే అందరు అనుకున్నట్టు బాలకృష్ణ తన తనయుడిని ఒక మాస్ కథతో కాకుండా ఒక లవ్ స్టోరీతో వెండితెరకు పరిచయం చేయనున్నటు తెలుస్తుంది. టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ లాంటి వైవిధ్యమైన కథలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ దర్శకుడు ‘రాహుల్ సాంకృత్యాన్’తో ఒక ప్రేమకథను సిద్ధం చేయిస్తున్నట్టు తెలుస్తుంది. అన్ని వర్గాల ఆడియన్స్ కు చేరువయ్యేలా మోక్షజ్ఞ ఎంట్రీ ఉండాలనే బాలకృష్ణ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.