Dasara Movie: చమ్కీల అంగిలేసి మూడో పాటను పట్టుకొస్తున్న నాని
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్‌ను క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తుండగా, పూర్తిగా రస్టిక్ కంటెంట్‌తో ఈ సినిమా రాబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో నాని రా అండ్ రస్టిక్ లుక్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ అయ్యేలా చేసింది. ఈ చిత్ర టీజర్ కూడా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

Nani Dasara Movie Third Single Song Update
Dasara Movie: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్‌ను క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తుండగా, పూర్తిగా రస్టిక్ కంటెంట్‌తో ఈ సినిమా రాబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో నాని రా అండ్ రస్టిక్ లుక్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ అయ్యేలా చేసింది. ఈ చిత్ర టీజర్ కూడా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
Dasara: దసరా ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన నాని అండ్ టీమ్..?
ఇక ఈ సినిమా మొదటి రెండు సాంగ్స్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే రిలీజ్ చేయగా, రెండు కూడా వైవిధ్యమైన సాంగ్స్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొదటి పాట ‘ధూంధాం’ అంటూ మాస్ నెంబర్‌గా ఉండగా, రెండో సాంగ్ ‘ఓరి వారి’ బ్రేకప్ సాంగ్‌గా వచ్చింది. ఈ రెండు పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుండి మూడో పాటకు సంబంధించిన అప్డేట్‌ను చిత్ర యూనిట్ తాజాగా ఇచ్చింది. దసరా మూవీ నుండి మూడో సింగిల్‌గా ‘చమ్కీల అంగిలేసి’ అనే ఫోక్ సాంగ్‌ను చిత్ర యూనిట్ పట్టుకొస్తుంది. ఈ పాటను మార్చి 8న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది.
Dasara : దసరాలో నాని కో-స్టార్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..
ఈ పోస్టర్‌లో నాని కలర్‌ఫుల్ షర్ట్ వేసుకుని స్కూటర్ నడుపుతుండగా, కీర్తి సురేష్ వెనకాల సీటులో కూర్చుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక దసరా చిత్రాన్ని మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
— Nani (@NameisNani) March 3, 2023