Dasara: ఆలస్యంగా రానున్న దసరా.. పండగ లేనట్టేనా?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ....

Dasara: ఆలస్యంగా రానున్న దసరా.. పండగ లేనట్టేనా?

Nani Dasara Movie Will Be Not Releasing During Dasara Festival

Dasara: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తనదైన మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రంగా తెరకెక్కించడంతో, ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక సినిమా తరువాత నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూవీ ‘దసరా’. ఇప్పటికే శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను పక్కా తెలంగాణ యాసలో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Dasara: ఊరమాస్ నానీ.. కెవ్వు కేక ‘స్పార్క్ ఆఫ్ దసరా’ గ్లిమ్ప్స్!

ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలను ఆమాంతం పెంచేశాయి. అయితే ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించేసి, సినిమాను దసరా పండుగ కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ.. ప్రస్తుతం ఇది సాధ్యం అయ్యేలా లేదని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమా షూటింగ్ అనుకున్నదానికంటే కాస్త ఆలస్యంగా జరుగుతుందని.. అందుకే ఈ సినిమాను ముందుగా అనుకున్నట్లుగా దసరా కానుకగా రిలీజ్ చేయడం కుదరదని వారు అంటున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆలస్యం అవుతాయని.. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని వారు అంటున్నారు.

Dasara : నాని ‘దసరా’ కోసం 12 కోట్లతో భారీ సెట్

మరి నిజంగానే నాని దసరా చిత్రం దసరాకు రావడం లేదా అనేదానిపై చిత్ర యూనిట్ అఫీషియల్‌గా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో నాని సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో నాని ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి తొలిసారి తెలంగాణ యాసలో నాని చేస్తున్న సినిమా కావడంతో ‘దసరా’ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.