Deepthi Ganta : డైరెక్టర్ గా మారిన నాని సోదరి.. నాకంటే తెలివైంది అంటూ నాని స్పెషల్ పోస్ట్..

నాని హీరోగా అందర్నీ అలరిస్తున్న సంగతి తెలిసిందే. వాల్ పోస్టర్ సినిమా అంటూ నిర్మాణ సంస్థని స్థాపించి పలు సినిమాలని కూడా తెరకెక్కిస్తున్నాడు నాని. నాని సోదరిగా దీప్తి అందరికి పరిచయమే. గతంలోనే ఓ షార్ట్ ఫిలింతో అందర్నీ మెప్పించింది......................

Deepthi Ganta :  డైరెక్టర్ గా మారిన నాని సోదరి.. నాకంటే తెలివైంది అంటూ నాని స్పెషల్ పోస్ట్..

Nani's Sister Deepthi Ganta Directed a movie releasing soon in Sony Liv ott

Deepthi Ganta :  నాని హీరోగా అందర్నీ అలరిస్తున్న సంగతి తెలిసిందే. వాల్ పోస్టర్ సినిమా అంటూ నిర్మాణ సంస్థని స్థాపించి పలు సినిమాలని కూడా తెరకెక్కిస్తున్నాడు నాని. నాని సోదరిగా దీప్తి అందరికి పరిచయమే. గతంలోనే ఓ షార్ట్ ఫిలింతో అందర్నీ మెప్పించింది దీప్తి. వాల్ పోస్టర్ సినిమా నిర్మాణ సంస్థలో కూడా పలు బాధ్యతలు చూసుకుంటుంది దీప్తి. తాజాగా దర్శకురాలిగా మారింది.

నాని అక్క దీప్తి తనే కథ రాసి దర్శకత్వం వహించింది. ‘మీట్ క్యూట్’ అనే పేరుతో దీప్తి ఓ సినిమాని తెరకెక్కించింది. అయిదు డిఫరెంట్ కథలు ఉండే ఆంథాలజీగా ఈ సినిమాని నాని నిర్మాణ్ సంస్థ అయిన వాల్ పోస్టర్ సినిమాలోనే నిర్మించారు. ఇందులో సత్యరాజ్‌, వర్ష బొల్లమ్మ, ఆదా శర్మ, రుహానీ శర్మ, శివ కందుకూరి.. పలువురు ప్రముఖులు నటించారు. భారీ కాస్ట్ తో భారీగానే ఈ సినిమా తెరకెక్కింది.

ఈ మీట్ క్యూట్ సినిమా సోని లివ్ ఓటీటీలో త్వరలో రానుంది. ఇప్పట్నుంచే ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు. ఈ సినిమా పోస్టర్ ని షేర్ చేస్తూ దీప్తి.. ”కోవిడ్ కాలంలో ఒక సంవత్సరం పాటు ఈ స్క్రిప్ట్ రాశాను. 6 నెలల పాటు ఈ సినిమాని తెరకెక్కించాము. రిలీజ్ చేయడానికి మరో సంవత్సరం వెయిట్ చేశాము. త్వరలో ఈ సినిమా నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, చిత్ర యూనిట్ సహకారంతో మీ ముందుకి రాబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాకి ఎంతగానో సహకరించిన నా తమ్ముడు నానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి” అని పోస్ట్ చేసింది.

Shahrukh Khan : 15 ఏళ్లయింది.. నిన్నే చూస్తూనే ఉన్నాను.. దీపికా పదుకొనేకి స్పెషల్ ట్వీట్ చేసిన షారుఖ్..

దీప్తి చేసిన ఈ పోస్ట్ ని నాని షేర్ చేస్తూ.. ”ఇన్నాళ్లు నేను ఒక్కడినే తెలివైనవాడిని అనుకునేవాడిని. కానీ తెలివైన ఒక అక్కకి తమ్ముడ్ని అని ఇప్పుడే తెలిసింది. ఇలా ఒక గొప్ప సినిమాని డైరెక్ట్ చేసినందుకు నేను చాలా గర్విస్తున్నాను” అంటూ చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ సినిమా టీజర్ నేడు రిలీజ్ అవ్వనుంది. త్వరలోనే ఈ సినిమా సోని లివ్ లో రానుంది.