Naresh : నేను రివెంజ్ తీర్చుకోడానికి ఈ సినిమా చెయ్యట్లేదు.. మళ్ళీ పెళ్లికి సీక్వెల్ కూడా ఉంటుంది..

మళ్ళీ పెళ్లి టీజర్, ట్రైలర్స్ చూసిన వాళ్లంతా ఇది నరేష్ - పవిత్రల కథే అనుకుంటున్నారు. తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నరేష్ మాట్లాడుతూ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Naresh : నేను రివెంజ్ తీర్చుకోడానికి ఈ సినిమా చెయ్యట్లేదు.. మళ్ళీ పెళ్లికి సీక్వెల్ కూడా ఉంటుంది..

Naresh Speech at Malli Pelli Trailer Launch event

Naresh :  టాలీవుడ్(Tollywood) లో బాగా వైరల్ అయిన జంట సీనియర్ నటుడు నరేష్(Naresh) – నటి పవిత్ర లోకేష్(Pavithra Lokesh). చాలా కాలం పాటు వీరు వార్తల్లో, సోషల్ మీడియాలో ట్రెండ్ గా నిలిచారు. కొన్ని రోజుల క్రితం నరేష్ వీళ్లిద్దరు జంటగా ‘మళ్ళీ పెళ్లి’(Malli Pelli) అనే సినిమా ప్రకటించి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత టీజర్, ట్రైలర్స్ తో రచ్చ చేశారు. ఈ టీజర్, ట్రైలర్స్ చూసిన వాళ్లంతా ఇది నరేష్ – పవిత్రల కథే అనుకుంటున్నారు. తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నరేష్ మాట్లాడుతూ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

మళ్ళీ పెళ్లి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నరేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా దర్శకులు MS రాజు వయసులో పెద్ద అయినా ఆలోచనలు యంగ్ గా ఉంటాయి. ఇటీవల ఆయన తీసిన డర్టీ హరి సినిమానే మంచి ఉదాహరణ. ఈ మళ్ళీ పెళ్లి కథ ఆయనదే. ఎప్పట్నుంచో ఆయన నాతో సినిమా అచేయాలనుకుంటున్నారు. ఈ కథతో వచ్చినప్పుడు ఓకే చేసి మా బ్యానర్ లోనే చేస్తాను అన్నాను. కృష్ణ గారు ఉన్నప్పుడు ఆయనకు కూడా కథ వినిపించాను. బాగుంది, చెయ్యండి అన్నారు. చాలా మంది ట్రైలర్ చూసి నా జీవిత కథ అనుకుంటున్నారు, కానీ కాదు. ఇది అందరికి కనెక్ట్ అయ్యే కథ. ఒక వ్యక్తిపై రివెంజ్ తీర్చుకోవడానికే ఈ సినిమా తీశారు అంటున్నారు. సినిమా తీసి రివెంజ్ తీర్చుకునే అంత డబ్బులు లేవు నాకు. సినిమా చూసాక కూడా మీకు సందేహాలు ఉంటే నేనే సమాధానమిస్తాను. నాకు తెలుగులో పేరు ఉన్నట్టే, పవిత్రకు కన్నడలో కూడా పేరు ఉంది. అందుకే రెండు భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ టీజర్ తర్వాత వచ్చిన స్పందన చూసి తమిళ్, మలయాళం, హిందీ లలో కూడా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నాం అని తెలిపారు.

Malli Pelli : నరేష్, పవిత్రా ‘మళ్ళీ పెళ్లి’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..

దీంతో నరేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ చేయమని అడిగితే కచ్చితంగా చేస్తాము అని అన్నారు నరేష్. నరేష్, పవిత్ర జంటగా MS రాజు దర్శకత్వంలో నరేష్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మళ్ళీ పెళ్లి సినిమా మే 26న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.