Netrikann : నయనతార ‘నెట్రికన్’ కూడా ఓటీటీలోనే..

‘వసంతకాలం’ మూవీలో బధిర (వినికిడి మరియు మాట్లాడలేని) పాత్రలో ఆకట్టుకున్న నయనతార ‘నెట్రికన్’ లో అంధురాలిగా ఛాలెంజింగ్ రోల్‌లో కనిపించనుంది..

Netrikann : నయనతార ‘నెట్రికన్’ కూడా ఓటీటీలోనే..

Netrikann

Netrikann: సౌతిండియా లేడీ సూపర్‌స్టార్.. స్టార్‌ హీరోయిన్‌ నయనతార ‘మూకుత్తి అమ్మన్’ అనే తమిళ్ సినిమాలో తొలిసారి అమ్మవారి పాత్రలో నటించింది. కోలీవుడ్‌లో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నఆర్జే బాలాజీ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరుతో ఓటీటీ ద్వారా విడుదల చేశారు. ఇప్పడు నయన్ ప్రధాన పాత్రలో నటించిన మరో సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది.

Nayanthara – Vignesh: నయనతార పేరు మార్చుకుంది.. పెళ్లికి రెడీ అయ్యారా..?

నయన్ యాక్ట్ చేస్ను తమిళ చిత్రం Netrikann – (నెట్రికన్‌). నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు నిర్మాత. తన ఫస్ట్ సినిమా ‘నానుమ్ రౌడీదాన్’ పేరు కలిసొచ్చేలా రౌడీ పిక్చర్స్‌ అనే బ్యానర్‌ రూపొందించి విఘ్నేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిద్దార్థ్ నటించిన ‘గృహం’ చిత్రంతో ప్రశంసలందుకున్న మిలింద్‌ రౌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇంతకుముందు ‘వసంతకాలం’ మూవీలో బధిర (వినికిడి మరియు మాట్లాడలేని) పాత్రలో ఆకట్టుకున్న నయనతార ‘నెట్రికన్’ లో అంధురాలిగా ఛాలెంజింగ్ రోల్‌లో కనిపించనుంది. అమ్మాయిలను కిడ్నాప్ చేసి హింసించే ఓ సైకో కన్ను కథానాయికపై పడితే.. అతని నుండి తప్పించుకోవడానికి ఆమె ఎలాంటి ప్రయత్నాలు చేసిందనే అంశాలతో ఆసక్తికరంగా తెరకెక్కించిన ‘నెట్రికన్’ సినిమా త్వరలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Nayanthara – Vignesh Shivan : ప్రియుడితో కలిసి వ్యాక్సిన్ వేయించుకున్న న‌య‌న‌తార‌..