SSMB28: మహేష్ సినిమాపై మరో వార్త.. ఇదైనా పక్కానా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషనల్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘SSMB28’ ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్‌ను అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన చిత్ర యూనిట్, రెండో షెడ్యూల్‌ను మాత్రం ఇంకా మొదలుపెట్టలేదు.

SSMB28: మహేష్ సినిమాపై మరో వార్త.. ఇదైనా పక్కానా?

New Schedule Plan For Mahesh Babu SSMB28

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషనల్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘SSMB28’ ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ అంశాలతో త్రివిక్రమ్ తనదైన మార్క్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌తో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

SSMB28 Update: మహేష్ మూవీ నుండి ఆ రోజున సర్‌ప్రైజ్ రానుందా..?

అయితే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్‌ను అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన చిత్ర యూనిట్, రెండో షెడ్యూల్‌ను మాత్రం ఇంకా మొదలుపెట్టలేదు. దీంతో ఈ రెండో షెడ్యూల్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ చిత్ర రెండో షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభించాలనే విషయంపై చిత్ర యూనిట్ ఓ క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. నవంబర్ నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ షూటింగ్‌ను స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇప్పటికే వెకేషన్ నుండి తిరిగి వచ్చేసిన మహేష్ బాబు కూడా ఈ వీలైనంత త్వరగా షూటింగ్‌ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.

SSMB28: మహేష్ సినిమాకు ఆ టైటిల్ అయితేనే బెస్ట్ అంటోన్న ఫ్యాన్స్!

ఇక ఈ సినిమాలో మహేష్ పాత్ర అల్టిమేట్‌గా డిజైన్ చేశాడట త్రివిక్రమ్. ఆయన చేసే పర్ఫార్మెన్స్ అభిమానులకు ట్రీట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. కాగా, ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ పూజా హెగ్డే మరోసారి హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. మరి ఈసారైనా అనుకున్న సమయానికి మహేష్-త్రివిక్రమ్ మూవీ రెండో షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభిస్తారో లేదో అనే సందేహం సినీ వర్గాల్లో నెలకొంది.