VNRTrio : మరోసారి టీమ్ అప్ అవుతున్న భీష్మ కాంబినేషన్.. ఈసారి అడ్వెంచర్ స్టోరీతో..

భీష్మ (Bheeshma) సినిమాతో సక్సెస్‌ఫుల్ కాంబో అనిపించుకున్న (Nithiin), రష్మిక (Rashmika Mandanna), వెంకీ కుడుముల.. మరోసారి చేతులు కలపబోతున్నారు. ఉగాది సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలోని నితిన్, రష్మిక మధ్య సంభాషణలు అందర్నీ అలరించేలా ఉన్నాయి.

VNRTrio : మరోసారి టీమ్ అప్ అవుతున్న భీష్మ కాంబినేషన్.. ఈసారి అడ్వెంచర్ స్టోరీతో..

Nithiin Rashmika Mandanna Venky Kudumula is back

VNRTrio : నితిన్ (Nithiin), రష్మిక (Rashmika Mandanna) కలిసి నటించిన సినిమా ‘భీష్మ’ (Bheeshma). 2020లో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని వెంకీ కుడుముల డైరెక్ట్ చేశాడు. ఈ ట్రైయో కాంబినేషన్ ఇప్పుడు మరోసారి చేతులు కలపబోతున్నారు. ఉగాది సందర్భంగా ఈరోజు (మార్చి 22) ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇక ఈ మూవీ అనౌన్స్ చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు.

Nithin : ఒరేయ్ నితిన్ అంటూ.. నితిన్‌పై ఫైర్ అవుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన అమ్మ రాజశేఖర్

దాదాపు 4 నిముషాలు ఉన్న ఈ వీడియోలో నితిన్, రష్మిక మధ్య సంభాషణలు అందర్నీ అలరించేలా ఉన్నాయి. ఈ క్రమంలోనే రష్మిక మాట్లాడుతూ.. నేను ఒక్క మాట మాట్లాడితే రెండు మూడు కాంట్రవర్సీలు అయ్యిపోతున్నాయి అని చెప్పగా, నితిన్ బదులిస్తూ.. అది చాలా బెటర్ నేను ఒక్క హిట్టు ఇస్తుంటే రెండు మూడు ప్లాప్‌లు అవుతున్నాయి అంటూ ప్రెజెంట్ వాళ్ళ పరిస్థిని చెప్పుకొచ్చారు. ఇక పుష్ప సినిమాలోని ‘స్వామి’ స్టెప్పుని రష్మిక వేస్తుంటే, నితిన్ మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ ని నువ్వు వాడుకున్నట్లు నేను వాడుకుంటే చాలా బాగుండేది అని నితిన్ వేసిన సెటైర్ అందర్నీ నవ్వించింది.

Rashmika Mandanna : మొన్న బాలకృష్ణ, ఇవాళ శుబ్‌మాన్‌ గిల్.. రష్మిక ఫాలోయింగ్ మాములుగా లేదుగా!

ఇదే వీడియోలో మ్యూజిక్ డైరెక్టర్ ని కూడా అనౌన్స్ చేసేశారు. వెంకీ కుడుముల గత 2 సినిమాలకు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందించగా.. ఈసారి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జి వి ప్రకాష్ ని (GV Prakash Kumar) సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక తన మూడో సినిమా తెరకెక్కించడానికి మూడేళ్ళ సమయం తీసుకున్న వెంకీ కుడుముల.. ఛలో, భీష్మ వంటి రొమాంటిక్ స్టోరీస్ తో కాకుండా ఒక అడ్వెంచర్ స్టోరీతో రాబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ని కూడా అనౌన్స్ చేయనున్నారు. మరి ఈ సక్సెస్ ఫుల్ కాంబో ఈ సినిమాతో కూడా హిట్టు అందుకుంటారా? లేదా? చూడాలి.