మోడీ బయోపిక్ విడుదల వాయిదా

  • Published By: vamsi ,Published On : April 5, 2019 / 01:34 AM IST
మోడీ బయోపిక్ విడుదల వాయిదా

ప్రధాని నరేంద్రమోడీ జీవితం ఆధారంగా వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రలో ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పీఎం నరేంద్రమోదీ’. ఈ సినిమా ముందుగా నిర్ణయించిన ప్రకారం ఇవాళ(ఏప్రిల్ 5)న విడుదల కావట్లేదు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సందీప్ సింగ్ వెల్లడించారు.

“మా సినిమా పీఎం నరేంద్రమోదీ ఏప్రిల్ 5న విడుదల కావడం లేదు. విడుదలకు సంబంధించిన అప్‌డేట్ త్వరలో అందిస్తాను” అని సందీప్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పీఎం నరేంద్రమోదీ విడుదలను నిలిపేయాలని కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్‌ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవడంతో సినిమా విడుదల ఆలస్యం కానుంది.

ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్‌ను చూస్తుంటే  రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ఫుల్ యాక్షన్ సినిమాలా మోడీ బయోపిక్ తీసినట్లు తెలుస్తుంది. నరేంద్ర మోడీ ఛాయ్ అమ్మే స్థాయి నుంచి ఆర్ఆర్ఎస్‌లో జాయిన్ అయ్యి  ప్రధానిగా ఎలా ఎదిగాడు అనే క్రమాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు.

ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా మోడీ ఉద్యమంలో పాల్గొనడం.. గుజరాత్‌లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన గోద్రా అల్లర్లు, అక్షర్ ధామ్ ఆలయంపై ఉగ్రవాదుల దాడులు.. ప్రధాని అయ్యాక ఉరి, పఠాన్ కోట్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను కూడా సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాను సందీప్ సింగ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను దేశంలోని అన్నీ బాషలలోను విడుదల చేయాలని చిత్రయూనిట్ భావించింది.