RRR మూవీలో ఎన్టీఆర్, చెర్రీ స్పెషల్ గెటప్స్‌..

  • Published By: sreehari ,Published On : August 4, 2020 / 09:51 AM IST
RRR మూవీలో ఎన్టీఆర్, చెర్రీ స్పెషల్ గెటప్స్‌..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఫిక్ష‌న‌ల్ స్టోరి మూవీ ‘రౌద్రం ర‌ణం రుధిరం(RRR)’. ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్స్ లో కనిపించనున్నారు. మన్యం వీరుడిగా రామ్ అల్లూరి లుక్ ఇటీవలే విడుదలైంది. తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్‌కు సంబంధించిన ఎన్టీఆర్ లుక్ ఇంకా విడుద‌ల కావాల్సి ఉంది.



అందిన స‌మాచారం మేర‌కు.. ఈ మూవీ రామ్ చరణ్, ఎన్టీఆర్ స్పెషల్ గెటప్స్ లో కనిపిస్తారంట.. ప్రత్యేకించి ఎన్టీఆర్ 6 గెట‌ప్పుల్లో క‌నిపిస్తార‌ట‌. ఇందులో బ్రిటీష్ వారికి దొర‌క్కుండా త‌ప్పించుకుని తిరగడం కోసం ఎన్టీఆర్ ఈ గెట‌ప్స్ మారుస్తుంటార‌ట‌. ఈ గెట‌ప్పుల్లో బ‌ట్ట‌త‌ల లుక్ కూడా ఉంటుందని సినీ వ‌ర్గాల్లో టాక్.. ఎన్టీఆర్, చరణ్‌లు గెటప్స్‌.. ఈ స్పెషల్‌ గెటప్స్‌ సినిమాకి అదనపు ఆకర్షణగా ఉంటాయట. పోలీస్‌ ఆఫీసర్‌గా చరణ్, బందిపోటు గెటప్‌లో ఎన్టీఆర్‌ కనిపిస్తారట.



క‌రోనా ఎఫెక్ట్‌తో ఆగిన ఈ సినిమా షూటింగ్‌.. అక్టోబ‌ర్ త‌ర్వాతే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మ‌రో వైపు 6 నుండి 9 నెల‌ల పాటు గ్రాఫిక్స్‌కు సమయం పట్టొచ్చు.. వ‌చ్చే ఏడాది కూడా ‘RRR‌’ సినిమా విడుద‌ల ఉండ‌క‌పోవ‌చ్చున‌ని టాక్ వినిపిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీత దర్శకుడు కాగా.. హీరో ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్, చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటిస్తున్నారు.