NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తరువాత తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా స్టార్ డైరెక్టర్స్ కొరటాల శివ....

NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!

Ntr Asked Buchi Babu To Change Love Track For His Movie

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తరువాత తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా స్టార్ డైరెక్టర్స్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలను వరుసగా పట్టాలెక్కించేందుకు తారక్ కసరత్తు కూడా మొదలుపెట్టాడు.

NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!

అయితే తారక్‌తో సినిమా చేసేందుకు ఓ యంగ్ డైరెక్టర్ చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడు. ‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్‌లో అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు బుచ్చిబాబు. ఈ డైరెక్టర్ తన నెక్ట్స్ సినిమాను తారక్‌తో చేయాలని ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో తారక్‌కు బుచ్చిబాబు కథను కూడా వినిపించాడట. అయితే ఈ సినిమా కథకు సంబంధించి తారక్ కొన్ని మార్పులు చేయాల్సిందిగా బుచ్చిబాబుకు సూచించాడట.

Buchi Babu Sana: తారక్- బుచ్చిబాబు కాంబోలో సినిమా ఉంటుందా.. ఉండదా?

కాగా, బుచ్చిబాబు చెప్పిన కథలో లవ్‌ట్రాక్‌ను మరింత ఎంగేజింగ్‌గా మార్చాల్సిందిగా తారక్ ఆర్డర్ వేయడంతో ఇప్పుడు అదే పనిలో బుచ్చిబాబు బిజీగా ఉన్నాడట. ఇక ఈ సినిమాను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించేలా బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడట. అంతేగాక ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను కూడా ఆయన ఫిక్స్ చేశాడట. మరి తారక్ కోసం బుచ్చిబాబు ఎలాంటి లవ్‌ట్రాక్‌ను రెడీ చేస్తాడా అనేది చూడాలి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.