NTR: సెన్సేషనల్ కాంబో.. ఎన్టీఆర్-ధనుష్ మల్టీస్టారర్‌కు ముహూర్తం ఫిక్స్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ అవార్డ్ కోసం అమెరికాలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఇక తన నెక్ట్స్ మూవీని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు తారక్. కాగా, ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

NTR: సెన్సేషనల్ కాంబో.. ఎన్టీఆర్-ధనుష్ మల్టీస్టారర్‌కు ముహూర్తం ఫిక్స్..?

NTR Dhanush Multistarrer To Be Announced Tomorrow

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ అవార్డ్ కోసం అమెరికాలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఇక తన నెక్ట్స్ మూవీని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు తారక్. కాగా, ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

NTR : అభిమానుల పై ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్.. వీడియో వైరల్!

అయితే, తారక్ త్వరలోనే ఓ భారీ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నాడని గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ జోరుగా వినిపిస్తోంది. దీంతో, ఎన్టీఆర్ చేయబోయే ఆ మల్టీస్టారర్ మూవీ ఏమిటా.. అందులో తారక్‌తో పాటు నటించే మరో హీరో ఎవరా.. ఈ సినిమాను డైరెక్ట్ చేసేది ఎవరా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే, తారక్‌తో ఎప్పట్నుండో ఓ సినిమా చేయాలని చూస్తున్న తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఈమేరకు ఓ మల్టీస్టారర్ మూవీ కథతో తారక్‌ను ఒప్పించాడట.

NTR : అమెరికాలో ల్యాండ్ అయిన యంగ్ టైగర్.. కాలిఫోర్నియా నుంచి అదిరిపోయే ఫొటో షేర్ చేసిన ఎన్టీఆర్..

ఇక ఈ సినిమాలో మరో హీరోగా తమిళ స్టార్ హీరో ధనుష్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మార్చి 8న చేయబోతున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీని నిజంగానే అనౌన్స్ చేస్తారా అనేది రేపు తేలనుంది.