Rajamouli: రాజమౌళి సెంటిమెంట్‌ను బ్రేక్ చేసేది ఎవరు.. తారక్ లేక చరణ్..?

స్టార్ డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేసే ప్రతి హీరో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటాడని అందరికీ ఓ నమ్మకం. అయితే, రాజమౌళి సినిమా తరువాత ఎవరితో సినిమా చేసినా ఫ్లాప్ ను మూటగట్టుకుంటారు. మరి ఈ సెంటిమెంట్ ను ఆర్ఆర్ఆర్ హీరోలు బ్రేక్ చేస్తారా..?

Rajamouli: రాజమౌళి సెంటిమెంట్‌ను బ్రేక్ చేసేది ఎవరు.. తారక్ లేక చరణ్..?

NTR Or Ram Charan Who Will Break Rajamouli Sentiment

Rajamouli: దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండియన్ సినిమాకు అరుదైన ఘనతను తీసుకొచ్చి చరిత్ర సృష్టించాడు. ఈ సినిమా ఆస్కార్ అవార్డును అందుకుని నెవర్ బిఫోర్ రికార్డును తన పేరిట రాసుకుంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు మేటి హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో గ్లోబల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరు హీరోల కెరీర్‌లో ఆర్ఆర్ఆర్ బెస్ట్ మూవీగా నిలిచిపోయిందని అభిమానులు గర్వంగా చెబుతున్నారు.

Rajamouli : రాజమౌళి ఇంట్లో ఆస్కార్ సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న వీడియో..

ఇక ఆర్ఆర్ఆర్ మేనియా నుండి బయటకొచ్చిన ఈ ఇద్దరు హీరోలు కూడా ఇప్పటికే తమ నెక్ట్స్ సినిమాలతో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 అనే సినిమాలో నటిస్తోండగా, తారక్ ఇటీవల NTR30 అనే ప్రాజెక్టును స్టార్ట్ చేశాడు. ఇక ఈ ఇద్దరు హీరోల అభిమానులను మాత్రం రాజమౌళి సెంటిమెంట్ వెంటాడుతోంది. తన కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా ఇవ్వని రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తారక్-చరణ్‌ల కెరీర్‌లో నమోదు చేశాడు.

Rajamouli : టాలీవుడ్ జక్కన జైత్రయాత్ర..

అయితే రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరో అయినా, తన నెక్ట్స్ సినిమాతో ఫెయిల్యూర్‌ను మూటగట్టుకున్న సెంటిమెంట్ గతకొన్నేళ్లుగా కంటిన్యూ అవుతోంది. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్, చరణ్‌లలో ఎవరైనా ఈ రాజమౌళి సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఇద్దరు హీరోల్లో రాజమౌళి సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసేది ఎవరో తెలియాలంటే ఈ ఇద్దరు హీరోల సినిమాలు రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.