NTR: వెకేషన్‌కు వెళ్లనున్న ఎన్టీఆర్.. కొరటాలతో కష్టమే అంటోన్న ఫ్యాన్స్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీ కోసం తారక్ కసరత్తులు మొదలుపెట్టాడు. ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతుండటంతో తారక్ ప్రస్తుతం ఓ వెకేషన్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడట.

NTR: వెకేషన్‌కు వెళ్లనున్న ఎన్టీఆర్.. కొరటాలతో కష్టమే అంటోన్న ఫ్యాన్స్..?

NTR Planning To Go For Vacation

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీ కోసం తారక్ కసరత్తులు మొదలుపెట్టాడు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టుపై కొరటాల రీవర్క్ చేసి, ఇటీవల ఫైనల్ స్క్రిప్టును ఓకే చేసినట్లుగా తెలుస్తోంది.

NTR : సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ మాట సాయం..

అయితే ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే మరింత ఆలస్యం అవుతుండటంతో తారక్‌ను కెమెరా ముందు ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. ఈ సినిమాకు కావాల్సిన లొకేషన్లను సెర్చ్ చేసే పనిలో ఉన్నారట చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతుండటంతో తారక్ ప్రస్తుతం ఓ వెకేషన్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడట. తారక్ తన ఫ్యామిలీతో కలిసి వచ్చే వారం అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

NTR : 19 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ సృష్టించిన రికార్డుకి 19 ఏళ్ళు..

దీంతో కొరటాలతో తారక్ సినిమా ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారా అని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన ఫ్యామిలీతో సమయాన్ని గడిపేందుకు తారక్ ఈ వెకేషన్ ప్లాన్ చేశాడని.. వచ్చిన తరువాతే కొరటాలతో సినిమాను స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. మరి చాలా రోజుల నుండి ఆలస్యం అవుతూ వస్తున్న ఈ సినిమా ఎప్పటికి పట్టాలెక్కుతుందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.