NTR : ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షూటింగ్ కి బ్రేక్.. ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ??

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమాలతోనే కాదు బుల్లితెరపై హోస్ట్ గా కూడా మెప్పిస్తున్నారు. బిగ్ బాస్ తొలి సీజ‌న్‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించి మెప్పించారు. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు'

NTR : ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షూటింగ్ కి బ్రేక్.. ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ??

Ntr Emk

NTR :  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమాలతోనే కాదు బుల్లితెరపై హోస్ట్ గా కూడా మెప్పిస్తున్నారు. అంతకుముందు బిగ్ బాస్ తొలి సీజ‌న్‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించి మెప్పించారు. ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటూ అదరగొడుతున్నారు. ఈ షో సక్సెస్ గా సాగిపోతుంది. తాజా స‌మాచారం ప్రకారం ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ సీజ‌న్ 1కు సంబంధించిన షూటింగ్ పూర్తి అయినట్టు తెలుస్తుంది.

సీజన్ 1లో 60 ఎపిసోడ్స్ ప్లాన్ చేశారు నిర్వాహకులు. తాజాగా ఆ 60 ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయింది. ఇంతటితో సీజన్ 1 కంప్లీట్ చేసి కొంచెం గ్యాప్ తీసుకొని సీజన్ 2 స్టార్ట్ చేస్తారని సమాచారం. ఈ 60 ఎపిసోడ్స్‌ కి కలిపి ఎన్టీఆర్ దాదాపు రూ.7.5 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడని సమాచారం.

Prabhas : ప్రభాస్ ‘సలార్’ సినిమా లీకులు.. షాక్ అయిన నిర్మాతలు

ఇక ఎన్టీఆర్ ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షూట్ కి వచ్చారు. తన తర్వాతి సినిమా ప్రకటించినా ఇప్పటిదాకా దాని నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పుడు ఈ షూటింగ్ కూడా అయిపోవడంతో త్వరలో తన తర్వాతి సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో మొదలపెట్టబోతున్నారు.