Ori Devuda: ఓరి దెవుడా… అప్పుడే ఓటీటీ లాక్..?

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓరి దేవుడా’ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. దర్శకుడు అశ్వత్ మరిముత్తు తెరకెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీలో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా ఓటీటీ వార్త అప్పుడే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Ori Devuda: ఓరి దెవుడా… అప్పుడే ఓటీటీ లాక్..?

Ori Devuda Locks OTT Partner

Ori Devuda: యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓరి దేవుడా’ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. దర్శకుడు అశ్వత్ మరిముత్తు తెరకెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీలో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Ori Devuda : ఓరి దేవుడా ప్రమోషన్స్‌కి వెంకటేష్ ఎందుకు రాలేదు?

ఇక ఈ సినిమా నేడు రిలీజ్ అవగా, అన్ని చోట్లా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన అందాల భామలు మిథిలా పాల్కర్, ఆశా భట్‌లు నటించారు. కాగా, ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తుండగా, ఈ సినిమా ఓటీటీ వార్త అప్పుడే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Ori Devuda: మాస్ కా దాస్ కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్!

ఓరి దేవుడా చిత్రానికి సంబంధించి అఫీషియల్ ఓటీటీ పార్ట్‌నర్ లాక్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా సొంతం చేసుకోగా, మరికొద్ది వారాల్లోనే ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌కు తెచ్చేందుకు ఆహా నిర్వాహకులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తెలియాలంటే అఫీషియల్ డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.