Sreeleela: హీరోయిన్ శ్రీలీల తల్లిపై పోలీస్ కేసులు!

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన 'పెళ్ళిసందడి' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ "శ్రీలీల". మొదటి సినిమాతోనే తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల, వరుస సినిమాలతో తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా మారిపోయింది. తాజాగా ఈ హీరోయిన్ కి సంబంధించిన ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. శ్రీలీల తల్లి 'స్వర్ణలత'పై పలు పోలీస్ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది.

Sreeleela: హీరోయిన్ శ్రీలీల తల్లిపై పోలీస్ కేసులు!

Police Cases On Heroine Sreeleela's Mother

Sreeleela: హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన ‘పెళ్ళిసందడి’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ “శ్రీలీల”. మొదటి సినిమాతోనే తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల, వరుస సినిమాలతో తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో రవితేజ ‘ధమాకా’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమాల్లో నటిస్తుంది.

Sreeleela: అందాల చూపులతో మతులు పోగొడుతున్న శ్రీలీల!

తాజాగా ఈ హీరోయిన్ కి సంబంధించిన ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. శ్రీలీల తల్లి ‘స్వర్ణలత’పై పలు పోలీస్ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. అలియన్స్ యూనివర్సిటీ వివాదంలో A2 ముద్దాయిగా అరెస్ట్ అయిన ఈమె, బెయిల్ పై బయటకు వచ్చింది. కాగా ఆమెపై మరో కేసు నమోదైనట్లు తెలుస్తుంది.

20 ఏళ్లగా దూరంగా ఉంటూ వస్తున్నారు శ్రీలీల అమ్మానాన్నలు, వారి విడాకుల కేసు కూడా కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే ఇటీవల స్వర్ణలత ఆమె భర్త అపార్ట్ మెంట్ లోకి తాళం పగలకొట్టుకుని మరి చొరబడిందంటూ, భర్త సుభాకర్ రావు అడుగుడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు. ఈ విషయాన్ని పోలీసులు మీడియాకి తెలియజేశారు.