Ponniyin Selvan 2: తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న PS-2

తమిళ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో, ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను తెలుగులోనూ గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Ponniyin Selvan 2: తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న PS-2

Ponniyin Selvan 2 Locks Date For Telugu Pre-Release Event

Ponniyin Selvan 2: తమిళ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ప్రెస్టీజియస్ హిస్టారికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్-1’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా పొన్నియిన్ సెల్వన్ 2ని కూడా రెడీ చేశాడు మణిరత్నం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు ముగించుకుని ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.

Ponniyin Selvan 2 : పొన్నియిన్ సెల్వన్ ప్రెస్ మీట్ గ్యాలరీ..

దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్ర ప్రమోషన్స్‌ను వివిధ నగరాల్లో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. పొన్నియిన్ సెల్వన్-2 మూవీ తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు డేట్ అండ్ ప్లేస్‌ను ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్.

Ponniyin Selvan II : పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్స్.. ట్విట్టర్ బ్లూ టిక్ పోగొట్టుకున్న త్రిష, జయం రవి..

ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 23న సాయంత్రం 5.30 గంటల నుండి హైదరాబాద్‌లోని నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో నటించిన లీడ్ యాకర్ట్స్ అందరూ ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేసిన ఈ సీక్వెల్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు ఎలాంటి రెస్సాన్స్‌ను అందిస్తారో చూడాలి.