Prabhas : తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటా.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ కామెంట్స్..

తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటా అంటూ..

Prabhas : తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటా.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ కామెంట్స్..

Prabhas comments on marriage at Adipurush Pre Release Event

Adipurush Pre Release Event : ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా.. రామాయణం బ్యాక్‌డ్రాప్ తో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. జూన్ 16న ఈ చిత్రాన్ని చూడడానికి అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు (జూన్ 6) తిరుపతి (Tirupati) శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో జరుగుతుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా రాబోతున్నారు.

Adipurush : ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది..

ఇక ఈ ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు పెళ్లి గురించి ప్రశ్నించారు. ప్రభాస్ బదులిస్తూ.. “పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుంటే నేను తిరుపతిలోనే చేసుకుంటాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ సినిమా కోసం చాలా కష్టపడినట్లు చెప్పుకొచ్చాడు. అభిమానులు ఇచ్చిన ధైర్యమే ఆదిపురుష్ ని బెటర్ అవుట్ ఫుట్ తో అందరి ముందుకు తీసుకు వచ్చేలా చేసిందని చెప్పుకొచ్చాడు.

Adipurush : ఆదిపురుష్‌కు ‘ది ఫ్లాష్’ టెన్ష‌న్‌.. ఇండియాలో కాదు గానీ.. ఓవ‌ర్సీస్‌లో మాత్రం..

కాగా ఈ ఈవెంట్ లో ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ని ఫుల్ యాక్షన్ కట్ తో రెడీ చేశారు. ‘వస్తున్నా రావణ’ అంటూ రాముడు రావణుడి పై యుద్ధం ప్రకటిస్తూ ట్రైలర్ అదిరిపోయింది. ఇక ఈ సెకండ్ ట్రైలర్ ని చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. గతంలో బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా తిరుపతిలోనే చాలా గ్రాండ్ గా జరిగింది. ఇప్పుడు ఆదిపురుష్ కూడా అక్కడే జరుగుతుండడంతో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని అభిమానులు చెబుతున్నారు.