Prabhas : ఆసియాలోనే నంబర్ వన్ సెలబ్రిటీగా ప్రభాస్

తాజాగా ప్రభాస్ మరో అరుదైన ఘనత సాధించారు. ఇండియా హీరోలెవ్వరికి సాధ్యం కాని ఘనతని సాధించారు ప్రభాస్. నెంబర్ వన్ ఏషియన్ సెలబ్రిటీగా ప్రభాస్ ఎంపికయ్యారు. యునైటెడ్ కింగ్‌డ‌మ్‌....

Prabhas : ఆసియాలోనే నంబర్ వన్ సెలబ్రిటీగా ప్రభాస్

Prabhas

Prabhas : ‘బాహుబలి’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. ఆ సినిమా సాధించిన రికార్డ్స్ అన్నీ ఇన్ని కాదు. ‘బాహుబలి’తో ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ కి గుర్తింపు వచ్చింది. దేశ విదేశాల్లోనూ ప్రభాస్ కి అభిమానులు ఏర్పడ్డారు. ఆ తర్వాత ‘సాహో’ సినిమాతో హాలీవుడ్ రేంజ్ సినిమా తీశాడు. తర్వాత నుంచి అన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు ప్రభాస్. ‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్ ఎన్నో రికార్డ్స్ ని సాధించాడు. బాలీవుడ్డ్ స్టార్ హీరోలని కూడా దాటేశాడు ప్రభాస్. రెమ్యునరేషన్ లో కూడా ఇండియాలోనే టాప్ లో ఉన్నాడు.

Katrina Kaif Vicky Kaushal : అంగరంగ వైభవంగా కత్రినా, విక్కీ కౌశల్ పెళ్లి… పిక్స్ వైరల్

తాజాగా ప్రభాస్ మరో అరుదైన ఘనత సాధించారు. ఇండియా హీరోలెవ్వరికి సాధ్యం కాని ఘనతని సాధించారు ప్రభాస్. నెంబర్ వన్ ఏషియన్ సెలబ్రిటీగా ప్రభాస్ ఎంపికయ్యారు. యునైటెడ్ కింగ్‌డ‌మ్‌ ఈస్టర్న్ ఐ వీక్లి అనే ప్రముఖ వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో ప్రభాస్ మొదటి స్థానం సంపాదించారు. ఈ సర్వేలో మీడియా, సినిమా, సోషల్ మీడియాలో అత్యధిక ప్రభావం చూపిన టాప్ 50 ఏషియన్ ప్రముఖులను ఎంపిక చేశారు. అందులో ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు.

Krithi Shetty : లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతున్న ఉప్పెన బ్యూటీ

ఈ విషయాన్ని ఆ సంస్థ స్వయంగా వెల్లడించింది. ఆ సంస్థ సోషల్ మీడియా పేజెస్ లో దీని గురించి పోస్ట్ చేశారు. ఇప్పటి దాకా ఇండియాలోనే నంబర్ వన్ అనుకునే ప్రభాస్ ఏకంగా ఆసియాలోనే నంబర్ వన్ స్థాయికి ఎదిగారంటే అది మన తెలుగు సినిమాకే గర్వ కారణం. ఇక రాబోయే భారీ సినిమాలతో ప్రభాస్ స్థాయి హాలీవుడ్ కి వెళ్లడం గ్యారెంటీ.