Prabhas: 15 ఏళ్ల తరువాత మళ్లీ రిపీట్ చేస్తున్న ప్రభాస్.. నిజమేనా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’ ఇప్పటికే రిలీజ్‌ను వచ్చే జూన్‌కు వాయిదా వేసుకుంది. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా తరువాత కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ చిత్రంలో నటిస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటుండగా, ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది.

Prabhas: 15 ఏళ్ల తరువాత మళ్లీ రిపీట్ చేస్తున్న ప్రభాస్.. నిజమేనా?

Prabhas To Romance Nayanthara After 15 Years

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’ ఇప్పటికే రిలీజ్‌ను వచ్చే జూన్‌కు వాయిదా వేసుకుంది. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా తరువాత కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ చిత్రంలో నటిస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటుండగా, ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది.

Prabhas : సింగీతంతో ప్రభాస్.. వైరల్ అవుతున్న ఫోటో..

కాగా ఈ సినిమా తరువాత కూడా ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా లైన్‌లో పెట్టాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రాజెక్ట్-K, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ‘స్పిరిట్’ అనే సినిమాలను తెరకెక్కించేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమాల్లో ‘స్పిరిట్’ ఇంకా షూటింగ్ మొదలుపెట్టకముందే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ క్లూ ఇచ్చేసింది. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ 15 ఏళ్ల తరువాత ఓ పనిచేసేందుకు సిద్ధమవుతున్నాడట.

Prabhas : ప్రభాస్, మారుతి సినిమా కోసం థియేటర్‌పై 10 కోట్లు ఖర్చు.. ఏంటి విషయం?

15 ఏళ్ల క్రితం యోగి చిత్రంలో ప్రభాస్ అందాల భామ నయనతారతో కలిసి రొమాన్స్ చేశాడు. ఆ తరువాత మళ్లీ ఈ జోడీ వెండితెరపై జతకట్టలేదు. అయితే ఇప్పుడు స్పిరిట్ సినిమా కోసం మరోసారి ప్రభాస్ నయన్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కించే తీరు అల్టిమేట్‌గా ఉండనుండగా, ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతారను హీరోయిన్‌గా తీసుకునేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నాడట. మరి నిజంగానే ఇంత లాంగ్ గ్యాప్ తరువాత ప్రభాస్‌తో నయనతార జోడీ కడుతుందో లేదో చూడాలి.