Akhanda : మీరు మనిషేనా?.. బాలకృష్ణని అడిగిన ‘అఖండ’ హీరోయిన్

బాలకృష్ణ ఉదయాన్నే మూడు గంటలకు లేస్తారు. ఆరు గంటలకే సెట్‌కు వస్తారు. రోజంతా షూటింగ్ చేస్తారు. ఆయనకి అసలు అలసట ఉండదు. ఆయన డెడికేషన్‌ చూసి అసలు..........,.

Akhanda : మీరు మనిషేనా?.. బాలకృష్ణని అడిగిన ‘అఖండ’ హీరోయిన్

Akhanda (2)

Akhanda :  బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో రాబోతున్న మూడో సినిమా ‘అఖండ’. ఈ సినిమా కూడా భారీ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ఆశిస్తున్నారు. డిసెంబర్ 2న రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమా టీం ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. సినిమాలోని మెయిన్ టీం అంతా మీడియాతో మాట్లాడుతున్నారు. తాజాగా ఈ సినిమా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ నిన్న మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి, బాలకృష్ణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియచేసింది.

KS Nageswararao : టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడి మృతి.. శోకసంద్రంలో శ్రీహరి కుటుంబం

బాలకృష్ణ గారు చాలా సీనియర్ హీరో. అంత పెద్ద హీరోతో నేను ఇది వరకు ఎప్పుడూ కలిసి నటించలేదు. బాలకృష్ణ గారి టైంకి వస్తారు. ఆయనతో పని చేస్తున్నానని తెలిసిన మొదటి రోజు ఎంతో నర్వస్‌గా ఫీలయ్యాను. కానీ కలిసిన ఐదు నిమిషాల్లోనే ఎంతో కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చేశారు అని తెలిపింది. ఆయనలాంటి పాజిటివ్ పర్సన్‌ను నేను ఇంత వరకు చూడలేదు. ఆయన అలా నడిచి వస్తుంటే సెట్ అంతా సైలెంట్ అవుతుంది. క్రమశిక్షణ, సమయపాలనలో ఆయన చాలా గ్రేట్. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను అని చెప్పింది ప్రగ్యా.

Bigg Boss 5 : తండ్రి లేని కూతురని దగ్గరై అడ్వాంటేజ్‌ తీసుకోలేదని మీ అమ్మకు చెప్పు

బాలకృష్ణ ఉదయాన్నే మూడు గంటలకు లేస్తారు. ఆరు గంటలకే సెట్‌కు వస్తారు. రోజంతా షూటింగ్ చేస్తారు. ఆయనకి అసలు అలసట ఉండదు. ఆయన డెడికేషన్‌ చూసి అసలు మీరు మనిషేనా? అని అడిగేశాను. బాలకృష్ణగారు నవ్వేసి ఊరుకున్నారు అని బాలకృష్ణ గురించి తెలిపింది. బాలకృష్ణ గారు అంత పవర్ ఫుల్ వ్యక్తి కాబట్టే బోయపాటి ‘అఖండ’ లాంటి పాత్రను రాశారేమో అని చెప్పింది.

Bigg Boss 5 : తల్లిని దీప్తి సునైనా గురించి మరీ మరీ అడిగిన షణ్ను

ఇక సినిమా గురించి మాట్లాడుతూ… ‘అఖండ’ లాంటి కథ, అలాంటి కారెక్టర్ నేను ఇంత వరకు చూడలేదు. ఇక్కడే అని కాదు, ఇతర భాషల్లోనూ అలాంటి పవర్ ఫుల్ పాత్రను నేను చూడలేదు. బాలకృష్ణ గారు ఆ పాత్రలో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తారు. నేను ఈ చిత్రంలో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రను పోషించాను. ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా కోసం నన్ను అడిగినప్పుడు బోయపాటి డైరెక్టర్ అని మొత్తం కథ వినకుండానే ఓకే చెప్పాను అని ప్రగ్యా మీడియాతో తెలిపింది.