Prashanth Varma : ఓ వైపు సినిమాలు.. ఓ వైపు బ్యాడ్మింటన్ లో పతకాలు.. అదరగొట్టేస్తున్న యంగ్ డైరెక్టర్

ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు ఈ యువ దర్శకుడు. ఇటీవల జరిగిన తెలంగాణ మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ టోర్నమెంట్‌లో బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని...............

Prashanth Varma :  ఓ వైపు సినిమాలు.. ఓ వైపు బ్యాడ్మింటన్ లో పతకాలు.. అదరగొట్టేస్తున్న యంగ్ డైరెక్టర్

Prashanth

 

Prashanth Varma :  కొంతమంది మన సెలబ్రిటీలు సినిమాలు మాత్రమే కాకుండా వేరే ట్యాలెంట్స్ తో కూడా మనల్ని అలరిస్తారు. తాజాగా ఓ యువ డైరెక్టర్ ఒక పక్క సినిమాలతో అలరిస్తూనే మరో పక్క బ్యాడ్మింటన్ లో అదరగొడుతూ పతకాలు సాధించేస్తున్నాడు. టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కొక్కటి ఒక్కో కాన్సెప్ట్ తో వస్తు ప్రేక్షకులని అలరిస్తున్నాడు. ఇప్పుడు కూడా ప్రశాంత్ వర్మ చేతిలో మరో రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు రెడీగా ఉన్నాయి.

Ram Charan : స్పెషల్ ఫుడ్ వండించి, టైం కేటాయించి.. పంజాబ్‌లో సోల్జర్స్‌తో చరణ్..

ఇలా ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు ఈ యువ దర్శకుడు. ఇటీవల జరిగిన తెలంగాణ మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ టోర్నమెంట్‌లో బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని రెండు పతకాలు సాధించాడు. ఈ పోటీల్లో కాంస్య, రజత పతకాలను గెలుచుకొని అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాడు. పతకాలతో ఉన్న ఫోటోని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. ఈ పతకాలని గెలుచుకున్నాను అంటూ పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు, ప్రేక్షకులు మనోడి ట్యాలెంట్ కి ఫిదా అయిపోయి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.