Prithviraj Sukumaran Role In Salaar: సలార్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ అలాంటి పాత్రలో కనిపిస్తాడా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తాడనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Prithviraj Sukumaran Role In Salaar: సలార్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ అలాంటి పాత్రలో కనిపిస్తాడా?

Prithviraj Sukumaran Role In Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాను సెప్టెంబర్ 28, 2023లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Salaar Movie Release Date : ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంకా సంవత్సరం ఆగాల్సిందే..

కాగా, ఈ సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తాడనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. సలార్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది.

Salaar Update: మాసివ్ అప్డేట్‌కు డేట్, టైమ్ లాక్ చేసిన సలార్

ప్రభాస్‌తో పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి చేసే సీన్స్ సినిమాకే హైలైట్‌గా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, విలక్షణ నటుడు జగపతి బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, హొంబాలే ఫిలింస్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.