Priyanka Chopra: టెన్త్‌క్లాస్‌లోనే బాయ్ ఫ్రెండ్‌తో దొరికిపోయా.. పీసీ లవ్ కహానీ!

ఇప్పుడంటే ప్రియాంకా చోప్రా గ్లోబల్ స్టార్ అయింది కానీ ఒకనాడు.. ఆమె మోడల్ గానే కెరీర్ ప్రారంభించింది. అంతేకాదు.. అందరిలానే టీనేజ్ లో ప్రేమ కహానీలు కూడా బాగానే నడిపింది. ప్రస్తుతం బాలీవుడ్ తో హాలీవుడ్ వరకు క్రేజీ స్టార్ అయిన పీసీ ఈ మధ్యనే ‘అన్‌ ఫినిష్డ్‌ (Unfinished) పేరుతో తన వ్యక్తిగత జీవితాన్ని.. తాను ఎదిగిన తీరును వివరిస్తూ ఓ పుస్తకాన్ని రాసింది.

Priyanka Chopra: టెన్త్‌క్లాస్‌లోనే బాయ్ ఫ్రెండ్‌తో దొరికిపోయా.. పీసీ లవ్ కహానీ!

Priyanka Chopra

Priyanka Chopra: ఇప్పుడంటే ప్రియాంకా చోప్రా గ్లోబల్ స్టార్ అయింది కానీ ఒకనాడు.. ఆమె మోడల్ గానే కెరీర్ ప్రారంభించింది. అంతేకాదు.. అందరిలానే టీనేజ్ లో ప్రేమ కహానీలు కూడా బాగానే నడిపింది. ప్రస్తుతం బాలీవుడ్ తో హాలీవుడ్ వరకు క్రేజీ స్టార్ అయిన పీసీ ఈ మధ్యనే ‘అన్‌ ఫినిష్డ్‌ (Unfinished) పేరుతో తన వ్యక్తిగత జీవితాన్ని.. తాను ఎదిగిన తీరును వివరిస్తూ ఓ పుస్తకాన్ని రాసింది. ఇందులో టెన్త్ లోనే ప్రేమలో పడిన ఓ విషయాన్ని కూడా పంచుకుంది.

పీసీ కొన్ని సంవత్సరాలు అమెరికాలోని తమ బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంది. అలా అక్కడ పదవ తరగతిలో ఉండగా బాబ్ అనే అబ్బాయితో ప్రియాంకా ప్రేమలో పడిపోయిందట. అతని మాటలు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎంతగానో ఆకట్టుకోగా తరచుగా కలిసేవాళ్లమని.. అలా ఒకసారి ఇద్దరం మా ఇంట్లో ఉండగా మా ఆంటీ రావడంతో దొరికిపోయామని చెప్పింది. ఆంటీ తిడతారనే బాబ్ ను బీరువాలో దాచినా మా ఆంటీ ఇల్లంతా వెతికి అతన్ని పట్టుకుందని చెప్పింది.

మొత్తంగా పదహారేళ్లకే లవ్ కహానీ గురించి పీసీ రాతలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఏది ఏమైనా పీసీ ఇలా ఓపెన్ గా చెప్పడం మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. కాగా, ఈ ముద్దుగుమ్మ తనకంటే పదేళ్లు చిన్నవాడైన హలీవుడ్‌ గాయకుడు నిక్‌ జోనాస్‌‌ని ప్రేమించి పెళ్ళాడి.. ఎవరేమనుకున్నా సరే అన్నట్లుగా పెళ్లి తరవాత కూడా పబ్లిక్ రొమాన్స్ చేస్తూ యమ కిక్కిస్తోంది.