Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్

టాలీవుడ్‌లో కరోనా కలకలం స్టార్ట్ అయ్యింది.

Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్

Bandla Ganesh

Bandla Ganesh: టాలీవుడ్‌లో కరోనా కలకలం స్టార్ట్ అయ్యింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిన క్రమంలో పలువురు రాజకీయ నాయకులు,సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతన్నారు.

ఈ క్రమంలోనే నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా మరోసారి కరోనా బారిన పడ్డారు. బండ్ల గణేష్ కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా కోవిడ్19 పాజిటివ్‌‌గా నిర్ధారించారు. బండ్ల గణేష్‌కు ఇది మొదటిసారి కాదు.. గతంలో కూడా కరోనా సోకింది.