Prabhas : ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత..

రెబల్ స్టార్ ప్రభాస్ మొత్తం 5 సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రెజెంట్ ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్-K సినిమాలతో పాటు మారుతీ దర్శకత్వంలో కూడా ఒక సినిమాని చేస్తున్నాడు. వీటిలో సలార్, మారుతీ సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాగా ప్రభాస్ నటిస్తున్న మరో మూవీ గురించి ఒక క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది.

Prabhas : ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత..

Prabhas

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ మొత్తం 5 సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది ఈ సినిమా. ఈ ఏడాది లోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రెజెంట్ ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్-K సినిమాలతో పాటు మారుతీ దర్శకత్వంలో కూడా ఒక సినిమాని చేస్తున్నాడు. ఒక మూవీ షెడ్యూల్ పూర్తి అవ్వగానే మరో మూవీ షెడ్యూల్ పాల్గొంటూ చిత్రీకరణ విషయంలో వేగం పెంచేశాడు ప్రభాస్. వీటిలో సలార్, మారుతీ సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Project K : ఇంటిలో కూడా ప్రాజెక్ట్-k డ్రెస్‌లోనే ఉంటున్న అమితాబ్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

కాగా ప్రభాస్ నటిస్తున్న మరో మూవీ గురించి ఒక క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ని సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమాకి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు మేకర్స్. ఈ సినిమాని బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ నిర్మించబోతున్నాడు. ఇటీవల ఈ నిర్మాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. స్పిరిట్ సినిమాకి సంబంధించిన వివరాలను తెలియజేశాడు.

స్పిరిట్ సినిమాని ఈ ఏడాది చివరిలో పట్టాలు ఎక్కించబోతున్నట్లు వెల్లడించాడు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని ఒక కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాని దర్శకుడు సందీప్ రెడ్డి డిజైన్ చేసినట్లు వెల్లడించాడు. కాగా ఈ దర్శకుడు ప్రస్తుతం హిందీలో ‘యానిమల్’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు కూడా తెలియజేశాడు నిర్మాత.