Pushpa : 'పుష్ప' సినిమాని ఈ స్టార్లంతా వద్దు అనుకున్నారు.. ఇప్పుడు బాధపడుతున్నారు.. | Pushpa story rejected by these stars

Pushpa : ‘పుష్ప’ సినిమాని ఈ స్టార్లంతా వద్దు అనుకున్నారు.. ఇప్పుడు బాధపడుతున్నారు..

అయితే 'పుష్ప' సినిమాలో చాలా క్యారెక్టర్స్ ముందు అనుకున్నది ఇప్పుడు ఉన్న వాళ్ళని కాదంట. 'పుష్ప' సినిమాలో హీరోగా మొదట అనుకుంది సూపర్ స్టార్ మహేశ్ ను. మహేష్ తో 'వన్ నేనొక్కడినే'......

Pushpa : ‘పుష్ప’ సినిమాని ఈ స్టార్లంతా వద్దు అనుకున్నారు.. ఇప్పుడు బాధపడుతున్నారు..

Pushpa :  సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక నటించిన ‘పుష్ప’ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ సినిమాకి ఫుల్ క్రేజ్ వచ్చింది. అన్ని భాషల్లోనూ భారీ విజయం సాధించి కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ సినిమా సాంగ్స్ , డైలాగ్స్ అయితే రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయి. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు చాలా క్యారెక్టర్స్ కి ప్రత్యేక గుర్తింపు వస్తుంది.

అయితే ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ముందు అనుకున్నది ఇప్పుడు ఉన్న వాళ్ళని కాదంట. సినీ పరిశ్రమలో ఒకరు వద్దు అనుకున్న క్యారెక్టర్ ఇంకొకరి వద్దకు వెళ్లడం సహజం. ఇలా చాలా సినిమాల్లో జరిగింది. స్టార్లు సైతం వద్దనుకున్న సినిమాలు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లిన కథలు చాలా ఉన్నాయి. తాజాగా ‘పుష్ప’ సినిమా కూడా అదే కోవలోకి చేరింది.

‘పుష్ప’ సినిమాలో హీరోగా మొదట అనుకుంది సూపర్ స్టార్ మహేశ్ ను. మహేష్ తో ‘వన్ నేనొక్కడినే’ తీసిన తర్వాత దర్శకుడు సుకుమార్ ఆయన్ను కలిసి ఒక పక్కా మాస్ మూవీ చేయాలని ఈ కథ చెప్పారంట. కానీ ఈ సినిమాలో క్యారెక్టర్ లుక్స్ పరంగా చాలా చేంజ్ అవ్వటం, వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో మహేశ్ పుష్పరాజ్ క్యారెక్టర్ కు నో చెప్పారట. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అల్లు అర్జున్ రూపంలో ఈ సినిమా బయటకి వచ్చి బన్నీ ఇమేజ్ ను మార్చేసింది.

ఇక హీరోయిన్ విషయంలో కూడా సమంతతో రంగస్థలం తీసిన తర్వాత ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి క్యారెక్టర్ కోసం మొదట సమంతని అడిగారట సుకుమార్. సమంత నో చెప్పటంతో ఆ అవకాశం రష్మికకి వెళ్ళింది. అయినా సమంతతో ఐటెం సాంగ్ చేపించాడు సుకుమార్.

RGV : నాకు 50 వేలు ఇవ్వకుండా ఆర్జీవీ మోసం చేశారు : మహేశ్వరి

ఇక పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా’ పాట ఎంత పాపులర్ అయిందో మన అందరికి తెలుసు. ఈ పాటకి మొదట దిశా పటాని అనుకున్నారట. ఆ తర్వాత నోరా ఫతే అనుకున్నారు. నోరా ఓకే చెప్పినా రెమ్యునరేషన్ భారీగా అడగడంతో వద్దనుకుని సమంతని ఓకే చేశారు. దీంతో సమంత కెరీర్ లో ఫస్ట్ ఐటెం సాంగ్ గా మిగిలింది.

Nirupam Paritala : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో డాక్టర్ బాబు

పుష్పలో భన్వర్ లాల్ షెకావత్ పాత్ర కు కూడా ముందు విజయ్ సేతుపతి అనుకున్నారట. ఆయన డేట్లు అడ్జస్ట్ అవ్వకపోవటంతో బెంగాలీ నటుడు జిష్ణు సేన్ గుప్తను అనుకున్నారు. అతను కూడా నో చెప్పడంతో టాలీవుడ్ హీరో నారా రోహిత్ కు కూడా వినిపించారట. నారా రోహిత్ కూడా నో చెప్పటంతో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ కు కథ వినిపించగా ఓకే చెప్పడంతో అతన్ని ఫిక్స్ చేసేసారు.

Kondaa Murali : ‘కొండా 2’ కూడా ఉంటుంది : RGV

ఇలా ఈ సినిమాలోని చాలా పాత్రలు వేరే వాళ్ళని అనుకొని వేరొకరితో చేశారు. ఈ సినిమాతో పాటు ఆ క్యారెక్టర్స్ కి కూడా బాగా పేరు వస్తుండటంతో ‘పుష్ప’ సినిమాని వదులుకున్న వారంతా ఇప్పుడు బాధపడుతున్నారట. ఇంత మంచి సినిమాని వదులుకున్నందుకు ఫీల్ అవుతున్నారట.

×