Raj Kundra : పోర్న్ వీడియో కేసు, పోలీసులకు లంచం ఇచ్చిన రాజ్ కుంద్రా ?

పోర్న్ వీడియోల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా తనను పోలీసులు అరెస్టు చేయకుండా తప్పించుకోవడానికి రూ. 25 లక్షల లంచం చెల్లించారనే వార్త హల్ చల్ చేస్తోంది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ శ్రీవాత్సవ అలియాస్ యాష్ ఠాకూర్ గత మార్చిలో ముంబైలోని అవినీతి శాఖ అధికారులకు పంపించిన ఈమెయిల్ లో ఈ విషయాన్ని వెల్లడించారని ‘మిడ్ డే’ వార్తా సంస్థ వెల్లడిస్తోంది.

Raj Kundra : పోర్న్ వీడియో కేసు, పోలీసులకు లంచం ఇచ్చిన  రాజ్ కుంద్రా ?

Rajkundra

Pornographic Films Case : పోర్న్ వీడియోల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా తనను పోలీసులు అరెస్టు చేయకుండా తప్పించుకోవడానికి రూ. 25 లక్షల లంచం చెల్లించారనే వార్త హల్ చల్ చేస్తోంది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ శ్రీవాత్సవ అలియాస్ యాష్ ఠాకూర్ గత మార్చిలో ముంబైలోని అవినీతి శాఖ అధికారులకు పంపించిన ఈమెయిల్ లో ఈ విషయాన్ని వెల్లడించారని ‘మిడ్ డే’ వార్తా సంస్థ వెల్లడిస్తోంది. మార్చిలో ఏసీబీకి అతడు ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చాడని..ఇదే ఈమెయిల్ ను ముంబై పోలీస్ కమిషనర్ కు ఏసీబీ ఫార్వర్డ్ చేసిందని తెలుస్తోంది.

Read More : GVMC Mayor : విశాఖలో చెట్లపై వేటు.. పార్కింగ్ కోసం పచ్చని చెట్లను నరికారు.

అయితే..ఈ విషయంపై స్పందించేందుకు నగర పోలీసు అధికారులు నిరాకరించారు. గత ఫిబ్రవరి 04వ తేదీనే పోర్న్ ఫిల్మ్ రాకెట్ కేసు నమోదు చేసినా..2021, జూలై 19వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. అయితే..అంతకాలం అరెస్టు కాకుండా ఉన్నారు. ముంబై క్రైమ్ బ్రాంచి అధికారులకు కుంద్రా లంచం ఇచ్చారనే వార్తలపై ఎవరూ నోరు విప్పడం లేదని తెలుస్తోంది. ఏసీబీకి ఫిర్యాదు చేసిన సంస్థ పేరు ప్లిజ్ మూవీస్. ఇది అమెరికాకు చెందిన సంస్థ. గతంలో న్యూ ఫ్లిక్ అని పిలిచేవారు.

Read More : Incom Tax : ఛాయ్, సమోసా అమ్ముతూ..వందల కోట్లు వెనకేసి..

హాట్ షాట్స్ పేరిట OTT యాప్ ద్వారా పోర్న్ చిత్రాలను క్రియేట్ చేయడం..ఇందులో కుంద్రా తెలివిగా వ్యవహరిస్తూ…లక్షలకు లక్షలు గడించాడని పోలీసులు భావిస్తున్నారు. హాట్ షాట్స్ తమ పాలసీ ఉల్లంఘనే అంటూ గూగుల్ ప్లే తీసివేశాక ఇతనికి ప్లాన్-బీ కూడా ఉందని పోలీసులు వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ముంబై శివారులో ఉన్న మాద్ దీవిలోని ఓ బంగ్లాలో పోర్న్ సినిమా చిత్రీకరణ చేస్తున్నట్లు సమాచారం రావడంతో…పోలీసులు దాడులు జరిపారు. ఈ కేసులో 11 మందిన అరెస్టు చేసి జరిపిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో..రాజ్ కుంద్రా పేరు బయటకు వచ్చింది. హాట్ షాట్స్ యాప్ నిర్వహిస్తున్న ఆయన్ను పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు.