SSMB29: మహేష్ కోసం జక్కన్న ఇంటర్నేషనల్ ప్లాన్.. నిజమేనా?

ఆస్కార్ వీరుడు, దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా తనకంటూ ఓ చరిత్రను సృష్టించుకున్నాడు. ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ యావత్ ప్రపంచాన్ని ‘నాటు’ స్టెప్పులు వేసేలా చేసింది. ఇక ఈ డైరెక్టర్ ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

SSMB29: మహేష్ కోసం జక్కన్న ఇంటర్నేషనల్ ప్లాన్.. నిజమేనా?

Rajamouli Planning To Rope International Actress Opposite Mahesh Babu For SSMB29

SSMB29: ఆస్కార్ వీరుడు, దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా తనకంటూ ఓ చరిత్రను సృష్టించుకున్నాడు. ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ యావత్ ప్రపంచాన్ని ‘నాటు’ స్టెప్పులు వేసేలా చేసింది. ఇక ఈ డైరెక్టర్ ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తన నెక్ట్స్ చిత్రాన్ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన రాజమౌళి, ఈ సినిమాను అడ్వెంచర్ మూవీగా తెరకెక్కించనున్నాడట.

SSMB29: ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌తో మహేష్ సినిమాపై అమాంతం పెరిగిపోయిన అంచనాలు!

కాగా, ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఇండియన్ సినిమా లవర్స్ మునుపెన్నడూ చూడని విధంగా తెరకెక్కించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కోసం భారీ క్యాస్టింగ్‌ను కూడా తీసుకోవాలని చూస్తున్నాడట. ఈ క్రమంలోనే మహేష్ సరసన హీరోయిన్‌గా తొలుత బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణెను తీసుకోవాలని రాజమౌళి ప్లాన్ చేశాడట. కానీ, ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో క్రియేట్ అవుతాయని.. అంతేగాక, ఈ సినిమాను ఇంటర్నేషనల్ మూవీగా తీర్చిదిద్దనుండటంతో, ఈ సినిమాలో మహేష్ సరసన ఓ హాలీవుడ్ బ్యూటీని హీరోయిన్‌గా తీసుకొచ్చేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నాడట.

SSMB29: మహేష్-రాజమౌళి మూవీపై కన్నేసిన హాలీవుడ్ బడా కంపెనీ..?

దీంతో ఈ సినిమాకు ఇంటర్నేషనల్ మూవీ అనే ముద్ర పడిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాను హాలీవుడ్ స్థాయి చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించాలని చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను ఈఏడాది చివరికల్లా స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. మరి ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయం తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.