Peddanna: ఫ్యామిలీ మ్యాన్‌గా తలైవా.. ఫలితం ఎలా ఉంటుందో?

సినిమాల స్పీడ్ ని ఈ మద్య కాస్త తగ్గించిన రజనీకాంత్.. లేట్ అయినా లేటెస్ట్ గా వస్తున్న తన అప్ కమింగ్ సినిమాలో మాత్రం విశ్వరూపాన్ని చూపించబోతున్నారు. భారీ స్టార్ కాస్ట్ తో శివ..

Peddanna: ఫ్యామిలీ మ్యాన్‌గా తలైవా.. ఫలితం ఎలా ఉంటుందో?

Rajinikanth

Peddanna: సినిమాల స్పీడ్ ని ఈ మద్య కాస్త తగ్గించిన రజనీకాంత్.. లేట్ అయినా లేటెస్ట్ గా వస్తున్న తన అప్ కమింగ్ సినిమాలో మాత్రం విశ్వరూపాన్ని చూపించబోతున్నారు. భారీ స్టార్ కాస్ట్ తో శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పెద్దన్న మూవీ ఫుల్ ఎనర్జీతో దీపావళి సందడిని మరింత పెంచబోతోంది. మరి రజనీకాంత్ యాక్షన్ నుంచి ఫ్యామిలీ మ్యాన్ గా ఎలా మారిపోయారో చూద్దాం.

Dhamaka: ఎనర్జీకి తగ్గ టైటిల్ ధమాకా.. డ్యూయెల్ రోల్ మరో బోనస్!

రజనీకాంత్.. అంటే అంతే ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. 70 ప్లస్ అయినా ఇంకా అంతే ఎనర్జీతో పెద్దన్నగా కిరాక్ ఎంట్రీ ఇస్తున్నారు. దీపావళికి రిలీజ్ అవుతున్న తన సినిమాకు సంబందించి ప్రమోషన్లు స్టార్ట్ చేసిన రజనీకాంత్.. పెద్దన్న సినిమాలో ఫుల్ ఎనర్జిటిక్ రోల్ ప్లే చేస్తున్నారు. నయనతార రజనీ జంటగా కీర్తిసురేష్, మీనా, ఖుష్బూ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ తో నవంబర్ 4న రిలీజ్ కాబోతోంది.

Dussehra Telugu Films: టీజర్లు, పోస్టర్లు, పాటలతో సందడిగా దసరా!

కబాలి, పేట, దర్బార్ ఇలా వరుసగా యాక్షన్ ఎంటర్ టైనర్స్ చేసిన రజనీకాంత్.. పెద్దన్న సినిమాతో ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయారు. సిస్టర్ సెంటిమెంట్ తో పండగరోజు మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడానికి ఫుల్ ప్లాన్స్ రెడీ చేసుకున్నారు రజనీకాంత్. కీర్తిసురేష్ రజనీకాంత్ చెల్లెలిగా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషనల్ వీడియోలు సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.

Unstoppable with NBK: బాలయ్య టాక్ షోలో చిరు.. ఎలాఉంటుందో ఫ్యాన్స్ ఊహకే!

ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న పెద్దన్న సినిమాని డైరెక్ట్ చేుసిన శివ అంతకుముందు సినిమాలన్నీ యాక్షన్ ఓరియంటెడ్ మూవీసే. అందుకే రజనీతో చేస్తున్న అన్నాత్తేలో కూడా రజనీకాంత్ కంప్లీట్ మాస్ యాంగిల్ మీదే ఫోకస్ చేశారు. అయితే ఈసినిమాలో యాక్షన్ కన్నా ఫ్యామిలీ సెంటిమెంట్ మీదే ఫోకస్ చెయ్యడంతో దీపావళికి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటూ ఇప్పటికే సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.