Jailer: ఖైదీ బాటలో జైలర్.. ఒక్క రాత్రిలోనే ముగించేయనున్న రజినీ..?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ సరికొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Jailer: ఖైదీ బాటలో జైలర్.. ఒక్క రాత్రిలోనే ముగించేయనున్న రజినీ..?

Rajinikanth Jailer Movie To Happen In One Night

Jailer: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ సరికొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Jailer : సూపర్ స్టార్‌కి తోడు మరో స్టార్ హీరో.. ‘జైలర్’తో వెండితెరపై విధ్వంసమే..

రజినీకాంత్ జైలర్ మూవీ గతంలో వచ్చిన కార్తి ఖైదీ మూవీని ఫాలో అవుతుందట. ఖైదీ మూవీ కథ మొత్తం ఒకే రాత్రి జరుగుతుంది. ఇప్పుడు జైలర్ మూవీ కథ కూడా ఇలాంటి స్ట్రాటెజీతోనే రాబోతుందట. ఈ సినిమా కథ జైలు నేపథ్యంలో సాగుతుండగా, ఎక్కువగా రాత్రే జరుగుతుందట. ఈ సినిమాకు డే షూటింగ్స్ దాదాపు లేవని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ సెట్ వేయగా, అందులో ఈ జైల్ నేపథ్యంలో సాగే సీన్స్‌ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Rajinikanth : బాలాజీని దర్శించుకున్న బాషా..

ఇక ఇలాంటి థ్రిల్లింగ్ సబ్జెక్టులను రజినీకాంత్ ఇప్పటివరకు చేయకపోవడంతో, ఆయన జైలర్ సినిమాను ఆసక్తితో చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తమిళ న్యూ ఇయర్ కానుకగా ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.