Allu Arjun: అప్పుడు చరణ్.. ఇప్పుడు బన్నీ.. ఆ డైరెక్టర్‌కు నో చెప్పారట!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ రష్యా రిలీజ్ కారణంగా ఆ సినిమాను ప్రమోట్ చేసేందుకు రష్యాలో బిజీబిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో అభిమానులు ఆదరిస్తుండటంతో బన్నీ క్రేజ్ కూడా ఆ స్థాయికి చేరుకుంది. అయితే ఇటీవల బన్నీకి ఓ తమిళ స్టార్ డైరెక్టర్ ఓ కథను వినిపించాడని.. కథ నచ్చినా కొన్ని కారణాల వల్ల ఆ డైరెక్టర్‌కు బన్నీ నో చెప్పినట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Allu Arjun: అప్పుడు చరణ్.. ఇప్పుడు బన్నీ.. ఆ డైరెక్టర్‌కు నో చెప్పారట!

Ram Charan Allu Arjun Said No To AR Murugadoss

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ రష్యా రిలీజ్ కారణంగా ఆ సినిమాను ప్రమోట్ చేసేందుకు రష్యాలో బిజీబిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో అభిమానులు ఆదరిస్తుండటంతో బన్నీ క్రేజ్ కూడా ఆ స్థాయికి చేరుకుంది. ఈ సినిమా రష్యా రిలీజ్ తరువాత బన్నీ ఇండియాకు చేరుకుని, పుష్ప పార్ట్ 2ను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Allu Arjun: సుకుమార్‌ను కమిట్‌మెంట్ అడిగిన బన్నీ.. ఎందుకో తెలుసా?

అయితే ఇటీవల బన్నీకి ఓ తమిళ స్టార్ డైరెక్టర్ ఓ కథను వినిపించాడని.. కథ నచ్చినా కొన్ని కారణాల వల్ల ఆ డైరెక్టర్‌కు బన్నీ నో చెప్పినట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ తెలుగులో మహేష్ బాబుతో కలిసి స్పైడర్ చిత్రాన్ని తెరకెక్కించి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఇప్పుడు ఆ మచ్చ పోగొట్టుకునేందుకు ఓ తెలుగు స్టార్ హీరోతో సినిమా చేయాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాడు ఈ డైరెక్టర్.

Allu Arjun: త్వరలో బన్నీతో భేటీ కానున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. ఎందుకో?

ఈ క్రమంలో ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఈ మేరకు చర్చలు జరిపాడు. కానీ, చరణ్ మురుగదాస్ చెప్పిన కథ నచ్చకపోవడంతో ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తిని చూపలేదు. దీంతో బన్నీని కలిసిన ఈ డైరెక్టర్ తన స్టోరీని వినిపించాడట. అయితే పాన్ ఇండియా స్థాయిలో కథ ఉన్నప్పటికీ, డేట్స్ ఇష్యూ వల్ల బన్నీ ఈ డైరెక్టర్‌కు నో చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి మురుగదాస్‌కు టాలీవుడ్‌లో సినిమా చేసేందుకు ఏ స్టార్ హీరో ముందుకు వస్తాడో చూడాలి.