Ram Charan : అప్పుడే RC15 రిలీజ్ డేట్ ఫిక్స్..

రామ్ చరణ్ సినిమా గురించి దిల్ రాజు మాట్లాడుతూ..''శంక‌ర్ ఇప్ప‌టికే కొంత మేర‌కు షూటింగ్ పూర్తి చేశారు. అనుకుంటున్న‌ట్లు ప్లానింగ్ ప్ర‌కారం జ‌రిగితే రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ సినిమా.......

Ram Charan : అప్పుడే RC15 రిలీజ్ డేట్ ఫిక్స్..

Rc 15

RC 15  :  మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్రస్తుతం RRR మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. కరోనా కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ మళ్ళీ వాయిదా పడింది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ దాదాపు నాలుగు సంవత్సరాలు కేటాయించాడు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వరుస సినిమాలని ఓకే చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం RC15 శంకర్ దర్శకత్వంలో హీరోగా పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది. ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

RC15 సినిమా షూటింగ్‌ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. లేకపోతే ఈ పాటికి మరో షెడ్యూల్ కూడా జరుగుతూ ఉండేది. పొలిటికల్ థ్రిల్లర్ గా శంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటికే కరోనా కారణంగా సినిమాలన్నీ వాయిదా పడుతుంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసేసారు దిల్ రాజు.

Shannu Deepu : బ్రేకప్ చెప్పింది దీప్తి.. మా అబ్బాయి కాదు.. వాళ్ళు కలుస్తారు : షణ్ముఖ్ తండ్రి

ప్రస్తుతం దిల్ రాజు తన అన్న కొడుకు ఆశిష్ హీరోగా నటించిన ‘రౌడీ బాయ్స్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అవ్వనుంది. దీంతో ఈ సినిమాని హై రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు దిల్ రాజు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడారు. రామ్ చరణ్ సినిమా గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. ”శంక‌ర్ ఇప్ప‌టికే కొంత మేర‌కు షూటింగ్ పూర్తి చేశారు. అన్నీ అనుకుంటున్న‌ట్లు ప్లానింగ్ ప్ర‌కారం జ‌రిగితే రామ్ చ‌ర‌ణ్ – శంక‌ర్ సినిమాను 2023 సంక్రాంతికి విడుద‌ల చేస్తాము” అని తెలిపారు. దీంతో ఈ సంక్రాంతి అవ్వకముందే, ‘ఆర్ఆర్ఆర్’ కూడా రిలీజ్ అవ్వకముందే వచ్చే సంక్రాంతిని కూడా బుక్ చేసేసుకున్నాడు దిల్ రాజు. అభిమానులు కూడా అదే టైంకి రావాలని కోరుకుంటున్నారు.