Ram Charan: రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ ఉందట.. కానీ ఆయనతో కాదట!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రా ‘RC15’ అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకుంటున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. అయితే చరణ్ నెక్ట్స్ మూవీని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తాడని అందరూ అనుకున్నా, ఇప్పుడు ఈ ప్రాజెక్టును పక్కనబెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ, RC16 సినిమా కోసం చరణ్ వేరొక డైరెక్టర్‌ను పట్టుకొస్తున్నట్లు తెలుస్తోంది.

Ram Charan Next Movie RC16 Is With Another Director
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రా ‘RC15’ అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకుంటున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా, పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ అంశాలతో పాటు ఓ చక్కటి సోషల్ మెసేజ్ ఉన్న మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు.
Ram Charan: రామ్‌చరణ్ ఆఫ్రికా టూర్ పిక్స్..
అయితే ఈ సినిమా తరువాత చరణ్ కెరీర్‌లో 16వ సినిమా ఎవరితో చేస్తాడా అనే విషయంపై గతకొంత కాలంగా తీవ్ర చర్చ సాగుతోంది. చరణ్ 16వ చిత్రాన్ని ‘జెర్సీ’ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై హీరో, దర్శకుడు ఎవరూ కూడా స్పందించలేదు. కాగా, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా అటకెక్కినట్లుగా గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇది దాదాపు నిజమేనని తెలుస్తోంది. దీంతో చరణ్ 16వ సినిమా ఇప్పట్లో లేనట్టేనా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Ram Charan : 70 ఏళ్ళ జపాన్ వీరాభిమానితో రామ్ చరణ్
కానీ.. చరణ్ మాత్రం వేరొక దర్శకుడితో చర్చలు జరుపుతున్నాడని.. త్వరలోనే తన 16వ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇవ్వబోతున్నట్లు చరణ్ సన్నిహితులు చెబుతున్నారు. ఈ వార్తతో మెగా ఫ్యాన్స్‌లో మళ్లీ సంతోషం వెల్లివిరిసింది. అయితే, చరణ్ ఈసారి ఏ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇస్తాడా అనే ఆసక్తి వారిలో క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు అప్పుడే ఆతృతగా ఎదురుచూస్తున్నారు.