Ram Charan: ఫ్యాన్స్ గెట్ రెడీ.. డబుల్ ట్రీట్‌తో వస్తోన్న మెగా పవర్ స్టార్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27న తన బర్త్‌డేను జరుపుకుంటున్న సందర్భంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు అభిమానులు. చరణ్ బర్త్‌డేను పురస్కరించుకొని RC15 చిత్ర యూనిట్ కూడా భారీ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. RC15 మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Ram Charan: ఫ్యాన్స్ గెట్ రెడీ.. డబుల్ ట్రీట్‌తో వస్తోన్న మెగా పవర్ స్టార్!

Ram Charan To Give Double Treat Of RC15

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27న తన బర్త్‌డేను జరుపుకుంటున్న సందర్భంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు అభిమానులు. ఇటీవల గ్లోబల్ స్టార్‌గా తన సత్తా చాటిన చరణ్‌కు అభిమానులు పెద్ద ఎత్తున విషెస్ చెబుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు ఆయన నటిస్తున్న తాజా చిత్రం నుండి అప్డేట్స్ వస్తే బాగుంటుందని కోరుతున్నారు.

Ram Charan : ఆస్కార్ తరువాత రామ్‌చరణ్ బర్త్ డే.. గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్న అభిమానులు..

అయితే, చరణ్ బర్త్‌డేను పురస్కరించుకొని RC15 చిత్ర యూనిట్ కూడా భారీ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా ప్రెస్టీజియస్ మూవీగా రాబోతున్న ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై హైప్ ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా నుండి చరణ్ బర్త్‌డే కానుకగా ఒకటి కాదు.. రెండు ట్రీట్స్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది.

RC15 మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మార్చి 27న ఉదయం 8.19 గంటలకు.. మధ్యాహ్నం 3.06 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. దీంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు అప్పుడే ఆసక్తిగా చూస్తున్నారు.

Ram Charan : నాటు నాటు తెలుగు పాట కాదు ఇండియన్ సాంగ్.. ఢిల్లీలో రామ్‌చరణ్!

ఈ సినిమాలో చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తుండగా, అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.