RGV: ఆరు వందల ఓట్ల కోసం జీరోలైన హీరోలు.. మాపై వర్మ!

అసలే ఆయన వివాదాలకు కేరాఫ్ అడ్రెస్.. రసాభాసగా మారి.. చివరికి ఒకరిని ఒకరు దూషణల వరకు వెళ్లిన సినిమా ఎన్నికలపై స్పందిస్తే ఎలా ఉంటుంది. ఆ పంచ్ లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. గతంలో..

RGV: ఆరు వందల ఓట్ల కోసం జీరోలైన హీరోలు.. మాపై వర్మ!

Rgv (3)

RGV: అసలే ఆయన వివాదాలకు కేరాఫ్ అడ్రెస్.. రసాభాసగా మారి.. చివరికి ఒకరిని ఒకరు దూషణల వరకు వెళ్లిన సినిమా ఎన్నికలపై స్పందిస్తే ఎలా ఉంటుంది. ఆ పంచ్ లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మా అసోసియేషన్ ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యనే సంచలన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓ సర్కస్ అని… అందులో ఉండే సభ్యులంతా జోకర్లు అంటూ వర్మ సంచలన ట్వీట్ చేశారు.

RGV: కొండా.. ఓ డైనమిక్ పర్సనాలిటీ.. అందుకే సినిమా

కాగా, ఇప్పుడు 10 టీవీ క్వశ్చన్ అవర్ లో వర్మ మరోసారి మా అసోసియేషన్, ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లంటే ప్రేక్షకులలో ఒక విధమైన అద్భుతం అనే భావనలో ఉన్నారని.. కానీ మొన్నటి ఎన్నికలతో వీళ్ళు మన కన్నా వెధవలు అని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారని.. అందుకే నేను కూడా అదే మాట చెప్పానన్నారు. అయితే.. ఇది ఏ ఒక్కరి కావాలని కుట్రలు పన్ని చేయలేదని.. అనుకోకుండానే ఎవరికి వారు ఆ పరిస్థితికి వచ్చేశారన్నారు. తన వ్యాఖ్యలు కూడా ఏ ఒక్కరిని ఉద్దేశించి అనలేదని.. అంతా ‘మా’ను.. ఎన్నికలను కలిపి జోకర్లు అనే మాట అన్నానని చెప్పారు.

RGV: నా దృష్టిలో హీరోలే లేరు.. నా కథలో అంతకన్నా ఉండరు

అసలు మా కు అసోసియేషన్ ఎందుకు.. దానికి బిల్డింగ్ ఎందుకు.. ఆ ఎన్నికలకు మ్యానిఫెస్టోలు ఎందుకని వర్మ ఘాటు ప్రశ్నలు సంధించారు. మాలో ఉన్న సభ్యుల మీద యాభై రెట్లు ఉన్న ఎక్కువ మంది ఉండే హోసింగ్ సొసైటీలకు ఎక్కడైనా బిల్డింగులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఆర్టిస్టుల మధ్య సమస్యలు పరిష్కరించేందుకు.. బిల్డింగుకు అసలు లింక్ ఏంటో ఇప్పటికీ నాకో పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పారు. కేవలం మీడియా కెమెరాలను చూసే మా సభ్యులు ఎవరికి వారు నటన మొదలు పెట్టారని.. ఇంత మంది చూస్తున్నారంటే సహజంగానే ప్రతిదీ చూసే తత్వం మారుతుందని మా ఎన్నికలలో కూడా అందుకే అంత హైప్ వచ్చిందన్నారు.