కేటీఆర్ సార్.. మీ పంచ్‌కి నా ముక్కు పచ్చడైంది..

మంత్రి కేటీఆర్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది..

  • Published By: sekhar ,Published On : April 13, 2020 / 12:10 PM IST
కేటీఆర్ సార్.. మీ పంచ్‌కి నా ముక్కు పచ్చడైంది..

మంత్రి కేటీఆర్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది..

దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ ప్రకటించడంతో తాగుబోతులు బాగా ఇబ్బంది పడుతున్నారని కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ అఖిల భారత తాగుబోతుల సంఘం తరపున తెలుగు రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

మందు దొరక్క జుట్టు పీక్కుంటున్నారని KCR, KTR, Y.S.Jagan‌లను ట్యాగ్ చేస్తూ వర్మ ట్వీట్ చేయగా.. ‘రామూ గారు మీరు హెయిర్ కట్ గురించే అడుగుతున్నారు కదా’ అంటూ KTR సెటైరికల్‌గా రిప్లై ఇచ్చారు. దీంతో తాజాగా వర్మకేటీఆర్‌కు రిప్లై ఇచ్చారు.

Read Also : వెంకీ ఆసన్ ఎందుకు వేశాడో ‘ఎఫ్ 3’లో చూపిస్తా.. మూడో హీరో!

‘కేటీఆర్ సార్.. నేను మీరు ఇచ్చిన రిప్లైను గుర్తించలేదు. మీలో ఉన్న హాస్య చతురత నాకు చాలా ఇష్టం. మీరు వేసిన పంచ్‌కు నా ముక్కు పచ్చడైపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో మీ ప్రభుత్వం చేస్తున్న కృషి మరువలేనిది..’ అంటూ ట్వీట్ చేశారు. వర్మ, కేటీఆర్ మధ్య జరిగిన సరదా సంబాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.