Ram Gopal Varma: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి.. ఆర్‌జీవీ మార్క్ ట్వీట్స్!

ఎటకారమో.. పొగడ్తలో అర్థం కాకుండా ట్వీట్స్ వెయ్యడంలో రామ్ గోపాల్ వర్మను మించినోళ్లు లేరు. ఇటీవలికాలంలో కాంట్రవర్శీల్లేకుండా స్ట్రెయిట్‌గా పాయింట్ చెప్పేస్తూ ట్వీట్లు వేస్తున్నా కూడా అందులో ఎక్కడో కొంచెం ఎటకారం కనిపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Ram Gopal Varma: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి.. ఆర్‌జీవీ మార్క్ ట్వీట్స్!

Rgv

Ram Gopal Varma: ఎటకారమో.. పొగడ్తలో అర్థం కాకుండా ట్వీట్స్ వెయ్యడంలో రామ్ గోపాల్ వర్మను మించినోళ్లు లేరు. ఇటీవలికాలంలో కాంట్రవర్శీల్లేకుండా స్ట్రెయిట్‌గా పాయింట్ చెప్పేస్తూ ట్వీట్లు వేస్తున్నా కూడా అందులో ఎక్కడో కొంచెం ఎటకారం కనిపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. లేటెస్ట్‌గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డిపై రామ్ గోపాల్ వర్మ తన మార్క్ ట్వీట్ వేసి అభినందించారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడైన మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి.. సింహంలాంటి వ్యక్తి అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. రేవంత్‌ నియామకంతో చాలాకాలం తర్వాత కాంగ్రెస్‌ పార్టీపై ఆసక్తి వచ్చిందంటూ ట్వీట్‌ చేశారు. ‘సింహం లాంటి వ్యక్తి రేవంత్‌రెడ్డిని అధ్యక్షుడిగా నియమించడం కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న అద్భుతమైన నిర్ణయంగా అభిప్రాయపడ్డారు రామ్ గోపాల్ వర్మ.

రేవంత్ అనే సింహాన్ని చూసి పులులన్నీ భయపడనున్నాయని, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారని ఆర్జీవీ ట్వీట్‌ చేశారు.

రేవంత్ రెడ్డి, రామ్ గోపాల్ వర్మకు చాలాకాలం నుంచి స్నేహం ఉంది. గతంలో వంగవీటి సినిమాను తెరకెక్కిచ్చిన సంధర్భంలో రేవంత్ రెడ్డి కూడా ఆ ఫంక్షన్‌కు హాజరై వర్మకు సపోర్ట్‌గా నిలిచారు.