గెట్ వెల్ సూన్ : షూటింగ్ లో గాయపడిన రాంచరణ్

  • Published By: veegamteam ,Published On : April 3, 2019 / 12:29 PM IST
గెట్ వెల్ సూన్ : షూటింగ్ లో గాయపడిన రాంచరణ్

మెగా హీరో రాంచరణ్ గాయపడ్డాడు. జిమ్ లో ఎక్సర్ సైజ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. కాలు చీలమండ దగ్గర ఈ గాయం అయ్యింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. కట్టుకట్టిన డాక్టర్లు.. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో పూణెలో జరగాల్సిన ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఆ తర్వాతే చెర్రీకి సంబంధించిన షాట్స్ తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ మూవీ ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేసింది.

చెర్రీ గాయపడిన విషయాన్ని తెలియజేయటానికి బాధగా ఉంది. మూడు వారాల తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభం అవుతుందని ప్రకటించారు. DVV ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. చెర్రీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది.

ఈ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నాడు. 2020 జూలైలో మూవీ రిలీజ్ కానుంది. చెర్రీ గాయపడటంతో ఇతర స్టార్స్ డేట్స్ షెడ్యూల్ లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది.